Bade Miyan Chote Miyan: అమితాబ్ గోవిందాను కొట్టాడా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరడుగులపైనున్న అమితాబ్ బచ్చన్, ఐదున్నర అడుగులకు కాస్త పైనున్న గోవిందాను ఓ సారి లాగి లెంపకాయ కొడతానన్నారట. అసలే ఆయన బిగ్ బి, తానేమో ‘చీచీ’ భయపడక ఏం చేస్తాను అని గోవిందా ఓ సందర్భంలో చెప్పాడు. ఇంతకూ అసలు విషయమేమిటంటే, ఈ లంబూజంబూ కలసి ‘బడేమియా- చోటేమియా’లో నటించారు. అందులో ఓ సన్నివేశం గురించి, గోవిందాతో చర్చిస్తూ బిగ్ బి ఈ సినిమా సక్సెస్ కాకుంటే చాచి లెంపకాయ కొడతానని బెదిరించారట. దాంతో తాను హడలి పోయానని గోవిందా చెప్పాడు.
‘బడే మియా చోటే మియా’ సినిమాకు డేవిడ్ ధవన్ డైరెక్టర్. ఈ సినిమాలో రవీనా టాండన్, రమ్యకృష్ణ, అనుపమ్ ఖేర్, పరేశ్ రావెల్ తదితరులు నటించారు. ఓ సీన్ సరిగా లేనందున అక్కడ పాట పెట్టాలని డేవిడ్ ధవన్ భావించారు. డేవిడ్ తీసే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాకుంటే నీ చెంప పగిలిపోతుందని గోవిందాకు బిగ్ బి సరదాగా వార్నింగ్ ఇచ్చారట. దాంతో గోవిందా, డేవిడ్ కు ఈ విషయం చెప్పి, ఆ సీన్ బదులు అదిరి పోయే పాట తీయాలని భావించారు. చివరకు నాటి మేటి నాయిక మాధురీ దీక్షిత్ తో బిగ్ బి, గోవిందా కలసి చిందులేసేలా “మఖ్నా…” పాటను తీశారు. ఆ పాట ఆ రోజుల్లో అదరహో అనిపించింది. సినిమా సక్సెస్ రూటులో సాగింది. గోవిందా చెంపను అమితాబ్ చేయి చేరకుండా కాపాడింది. ఇప్పుడు ఈ సరదా విషయాన్ని పలువురు ఆసక్తిగా ఆలకిస్తూ ఉండడం విశేషం!
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
తాజావార్తలు
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Schools Holiday: భారీ వర్షాలతో అతలాకుతలం.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!