Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bitter Gourd Chips Recipe: కాకరకాయ అంటే చాలా మంది పిల్లలు ముఖం చిట్లించుకుంటారు. చేదు రుచి కారణంగా ఈ కూరను తినేందుకు వారు ఇష్టపడరు. కానీ అదే కాకరకాయను కరకరలాడే చిప్స్‌గా, కారంగా, రుచికరంగా తయారు చేస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఈ ప్రత్యేక రెసిపీతో మీరు చేదు లేకుండా, పిల్లలు కూడా ఇష్టపడేలా కాకరకాయ చిప్స్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
ఇంటి వంటలో ఆరోగ్యకరమైన పదార్థాలను రుచికరంగా మార్చడం చాలా ముఖ్యం. కాకరకాయలో ఉన్న పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే దాని చేదు రుచి వల్ల చాలామంది దూరంగా ఉంటారు. ఇప్పుడు ఈ చిట్కాతో ఆ చేదును తగ్గించి, కరకరలాడే స్నాక్‌గా మార్చుకోవచ్చు.
Also Read
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
కావలసిన పదార్థాలు
* కాకరకాయ – 250 గ్రాములు (సన్నగా తరిగినవి)..
* శనగపిండి – 3 టేబుల్ స్పూన్లు..
* బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్లు..
* మొక్కజొన్న పిండి – 1 టేబుల్ స్పూన్..
* పసుపు, ఎర్ర మిరప, ధనియాల పొడి, ఉప్పు..
* ఆమ్చూర్ పొడి లేదా నిమ్మరసం
* 1 టీస్పూన్ నూనె – వేయించడానికి
ఎలా తయారు చేయాలి..
ముందుగా 250 గ్రాముల కాకరకాయలను తీసుకుని సన్నగా గుండ్రంగా కోయాలి.. మధ్యలో ఉన్న గింజలను తీసివేయాలి. తర్వాత వాటికి ఉప్పు, నిమ్మరసం పట్టించి 15–20 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత ముక్కలను మెల్లగా పిండి, నీటితో కడగాలి. ఈ విధానం వల్ల కాకరకాయలోని చేదు తగ్గుతుంది. తర్వాత ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, మొక్కజొన్న పిండి వేసి కొద్దిగా నీటితో కలపాలి. అందులో పసుపు, ఎర్ర మిరప పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి మిశ్రమాన్ని సిద్ధం చేయాలి. ఈ మసాలా పూతను కాకరకాయ ముక్కలకు బాగా పట్టించాలి. పిండిని కలిపేటప్పుడు నీరు ఎక్కువగా పోయకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేడి చేసి, మంటను మధ్యస్థంగా ఉంచి కాకరకాయ ముక్కలను కొద్దికొద్దిగా వేయాలి. అవి బంగారు రంగులోకి మారి కరకరలాడేంత వరకు వేయించాలి. వేయించిన తర్వాత అదనపు నూనె తొలగించేందుకు టిష్యూపై ఉంచాలి. వడ్డించే ముందు కొద్దిగా చాట్ మసాలా చల్లి వేడిగా సర్వ్ చేయండి. టీతో పాటు ఈ చిప్స్‌ను స్నాక్‌గా ఆస్వాదించవచ్చు. ఇంకా కరకరలాడేలా చేయాలనుకుంటే మసాలా పూతలో కొద్దిగా నువ్వులు కలిపితే రుచి మరింత పెరుగుతుంది.
ఇలా సులభంగా ఇంట్లోనే తయారు చేసిన కాకరకాయ చిప్స్‌ను పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఆరోగ్యంతో పాటు రుచిని కలిపిన ఈ వంటకం మీ ఇంట్లో తప్పక ప్రయత్నించండి. చేదు కూడా లేకుండా పోవడంతో.. పిల్లలు.. పెద్దలు ఇలా తేడా లేకుండా అంతా లాగించేస్తారు..
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!