Power Star: శరవేగంగా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ మూవీ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో వేసిన సెట్స్ లో జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా కోసం జాతీయ అవార్డు గ్రహీత, పద్మశ్రీ తోట తరణి వేసిన సెట్స్ ను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చూసి, ఆయన్ని ఆత్మీయంగా సత్కరించారు. అలానే ఆ సెట్స్ లో చిత్రీకరించే పోరాట సన్నివేశాలకు సంబంధించిన ప్రిపరేషన్ లోనూ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇప్పుడు ఆ సన్నివేశాల చిత్రీకరణే జరుగుతోంది. దీనికి సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను గత కొన్ని రోజులుగా దర్శకుడు క్రిష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ సన్నివేశ చిత్రీకరణ అనంతరం పవన్ కళ్యాణ్ కెమెరాకు ఫిట్ చేసిన మానిటర్ లో సీన్ ను వీక్షించే స్టిల్ ను క్రిష్ పెట్టారు.
17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకానికి సంబంధించిన కథ కావడంతో ఆనాటి వాతావరణానికి తగ్గట్టుగా పలు సెట్స్ ను రూపొందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన అత్యధిక భాగం షూటింగ్ ఈ సెట్స్ లోనే జూలై నెలాఖరు వరకూ జరిగే ఆస్కారం ఉంది. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ. దయాకరరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయన సోదరుడు, లెజండరీ ప్రొడ్యూసర్ ఎ. ఎం. రత్నం సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరిహర వీరమల్లు’కు బుర్రా సాయిమాధవ్ సంభాషణలు రాశారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు.
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
తాజావార్తలు
-
Skoda Kylaq Sportline: భారత్‌లో కొత్త స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్ వేరియంట్ విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 5-స్టార్ సేఫ్టీ
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్‌పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?