Israeli Airstrike: ఇది ఇజ్రాయిల్ అంటే.. అక్టోబర్ 7 దాడుల హమాస్ కమాండర్ హతం..
- అక్టోబర్ 07 నాటి దాడులకు కారణమైన హమాస్ కమాండర్ హతం..
- వైమానిక దాడిలో చంపేసినట్లు చెప్పిన ఇజ్రాయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israeli Airstrike: అక్టోబర్ 07, 2023న ఇజ్రాయిల్‌పై హమాస్ భీకర ఉగ్రదాడి చేసింది. 1200 మందిని క్రూరంగా హతమార్చింది. చాలా మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాలోని హమాస్‌పై, లెబనాన్‌లోని హిజ్బుల్లాపై దాడులు చేసి, ఈ రెండు ఉగ్రవాద సంస్థల్ని నామరూపాలు లేకుండా చేస్తోంది. ఇప్పటికే హమాస్‌కు చెందిన టాప్ లీడర్లు ఇస్మాయిల్ హానియే, యాహ్యా సిన్వార్‌లను హతమార్చింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను వెతికి వేటాడి చంపేసింది.
Read Also: Startup Journey: సాప్ట్ వేర్ జాబ్ వదిలేసి… దోశల వ్యాపారంలోకి వచ్చిన యువకుడు
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
తాజాగా, అక్టోబర్ 07 నాటి మారణహోమానికి సూత్రధారుల్లో ఒకరుగా ఉన్న సీనియర్ హమాస్ సైనిక కమాండర్‌ను శనివారం ఎయిర్ స్ట్రైక్స్‌లో ఇజ్రాయిల్ చంపేసింది. హమాస్ సైనిక విభాగం, కస్సామ్ బ్రిగేడ్స్‌లో సీనియర్ సభ్యుడుగా ఉన్న రాద్ సాద్‌ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) హతమర్చాయి. ఇతను హమాస్‌కు ఆయుధాలు సమీకరించుకునేందుకు, తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. హమాస్ ప్రస్తుత సైనిక అధిపతి ఇజ్ అల్-దిన్ హద్దాద్‌కు డిప్యూటీగా అతను పరిగణించబడ్డాడని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.
దాడికి సంబంధించిన దాడి వీడియోను ఇజ్రాయిల్ విడుదల చేసింది. ఒక వాహనం పేలిపోతున్నట్లు ఇందులో కనిపించింది. రషీద్ కోస్టల్ రోడ్‌లో కారులో పారిపోతున్న సమయంలో సాద్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో సాద్‌తో కలిసి ముగ్గురు మరణించినట్లు ఇజ్రాయిల్ చెప్పింది. గాజాలో ఇప్పటికీ పనిచేస్తున్న హమాస్ కమాండర్లలో సాద్ కూడా ఒకరుగా ఐడీఎఫ్ చెబుతోంది. ఇటీవల, ఇజ్రాయిల్ బలగాలపై దాడులు చేయడానికి సాద్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు ఇజ్రాయిల్ ఆరోపించింది.
🔴 ELIMINATED: Ra’ad Sa’ad, Head of the Weapons Production Headquarters of Hamas’ Military Wing and One of the Architects of the Brutal October 7th Massacre
Sa’ad was one of the last remaining veteran senior militants in the Gaza Strip and a close associate of Marwan Issa, the… pic.twitter.com/nIa1VUqryI
— Israel Defense Forces (@IDF) December 13, 2025
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!