Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, కామెడీ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ “ది రాజా సాబ్” (The Raja Saab). ఈ రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ తాజాగా “సహానా.. సహానా” (Sahana Sahana Song Promo) అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.
ఈ మెలోడీ సాంగ్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్, నిధి అగర్వాల్ జంటగా ఉన్న ఈ ప్రోమోలో.. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ప్రభాస్ “సహానా.. సహానా” అంటూ ఉంటే సినిమాలో వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్.. కచ్చితంగానేలా కనపడుతుంది. ఇప్పటికే విడుదలైన ‘రెబల్ సాబ్’ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ “సహానా.. సహానా” పూర్తి వీడియో సాంగ్ డిసెంబర్ 17న సాయంత్రం 6.35 గంటలకు విడుదల కానుంది. ఇక ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకెందుకు ఆలస్యం సాంగ్ ప్రోమో ఇక్కడ చూసేయండి.
Pamidi: దారుణం.. పోలీసుపై కత్తితో దాడి చేసిన మతిస్థిమితం లేని యువకుడు..!