Priyamani :ఇంకా తెరపై మెరుస్తూనే ఉన్న ప్రియమణి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపించే ప్రియమణి అభినయంతో పాటు అందాల ఆరబోతతోనూ అలరించింది. అందువల్లే ప్రియమణి అభిమానగణాలకూ కొదువలేదు. టాలీవుడ్ టాప్ స్టార్స్ తోనూ, యంగ్ హీరోస్ తోనూ ప్రియమణి నర్తించిన తీరు ప్రేక్షకులకు పరమానందం పంచింది. తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన ఈ కన్నడ కస్తూరి తమిళ చిత్రం ‘పరుతివీరన్’తో ఉత్తమనటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. తన దరికి చేరిన ప్రతీపాత్రకూ న్యాయం చేయాలని తపించింది. దక్షిణాది నాలుగు భాషల్లోనే కాదు, ఉత్తరాదిన హిందీలోనూ ప్రియమణి అభినయం అలరించింది. అయితే ప్రియమణికి మాత్రం తెలుగు చిత్రాలతోనే అశేష ప్రేక్షకాభిమానం లభించిందని చెప్పవచ్చు.
ప్రియ వాసుదేవ్ మణి 1984 జూన్ 4న బెంగళూరులో జన్మించింది. చదువుకొనే రోజుల్లోనే ప్రియమణి స్కూల్ లో జరిగే ఫంక్షన్స్ లో పాల్గొనేది. ఆమె ఉత్సాహం చూసి కన్నవారు సైతం ప్రోత్సహించారు. చదువు కాగానే కాంచీపురం సిల్క్స్ కు మోడల్ గా కనిపించింది ప్రియమణి. ప్రముఖ నటి విద్యాబాలన్, ప్రియమణికి సమీప బంధువు. దాంతో ఈమెలోనూ చిత్రసీమలో ప్రవేశించాలన్న అభిలాష కలిగింది. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు తనయుడు వల్లభ హీరోగా పరిచయమైన ‘ఎవరే అతగాడు’ చిత్రంతోనే ప్రియమణి కూడా తొలిసారి తెరపై కనిపించింది. జగపతిబాబుతో నటించిన ‘పెళ్ళైన కొత్తలో’ సినిమా ప్రియమణికి మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. బాలకృష్ణతో ‘మిత్రుడు’లోనూ, నాగార్జునతో ‘రగడ’లోనూ నటించింది ప్రియమణి. ‘నారప్ప’లో వెంకటేశ్ సరసన నటించింది.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తెలుగులో ప్రియమణి పలుచిత్రాలలో నటించినా, రాజమౌళి ‘యమదొంగ’లో జూ.యన్టీఆర్ జోడీగా ఆమె అలరించిన వైనం జనాన్ని భలేగా ఆకట్టుకుంది. నాయికగా అనేక చిత్రాలలో సందడి చేస్తూ సాగిన ప్రియమణి ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ హిందీ సినిమాలో ఐటమ్ గాళ్ గానూ మురిపించింది. పెళ్ళయిన తరువాత ప్రియమణి నటనకు గుడ్ బై చెబుతుందేమో అనుకున్నారు. అయినా, తన వద్దకు వచ్చిన అవకాశాలను సక్రమంగా వినియోగించుకుంటున్నారామె. రానా ‘విరాటపర్వం’లో కామ్రేడ్ భారతక్కగా ప్రియమణి నటించింది. త్వరలో ఈ సినిమా జనం ముందుకు రానుంది. ‘మైదాన్’ అనే హిందీ చిత్రం, ‘సైనేడ్’, ‘డాక్టర్ 56’, ‘ఖైమారా’అనే కన్నడ చిత్రాలలోనూ, ‘కొటేషన్ గ్యాంగ్’ అనే తమిళ చిత్రంలోనూ ప్రియమణి తన అభినయంతో ఆకట్టుకోనుంది. పెళ్ళయ్యాక కూడా బిజీగా సాగుతోన్న ప్రియమణి రాబోయే తన చిత్రాలలో ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!