Bondi Beach Shooting: ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రసిద్ధ బోండి బీచ్‌లో భయంకరమైన కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. “హనుక్కా బై ది సీ” అనే కమ్యూనిటీ కార్యక్రమంలో నల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు వంతెనపై నుంచి కాల్పులు జరిపారు. ఈ సంఘటనతో భయాందోళనలకు గురైన ప్రజలు ప్రాణాల కోసం పరుగులు తీశారు. ఉగ్రవాదుల కాల్పులలో 11 మంది మరణించారని, వారిలో దాడి చేసిన వారిలో ఒకరు ఉన్నారని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో బోండి బీచ్ వద్ద దాడి చేసిన వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నట్లుగా ఉంది. ఆ టైంలో ఒకరు మాత్రం తన ప్రాణాలకు తెగించి కాల్పులు జరుపుతున్న ఒక ఉగ్రవాది వెనుకకు వెళ్లి అతడిపై దాడి చేసి, ఆ ఉగ్రవాది నుంచి తుపాకీని లాక్కున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో 15 సెకన్ల నిడివితో ఉంది. ఈ వీడియోలో పార్క్ చేసిన కార్ల వెనుక దాక్కున్న ఒక వ్యక్తి కాల్పులకు తెగబడిన ఉగ్రవాది వెనుక నుంచి వైపు అతడి దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి, వాడి మెడ పట్టుకుని, అతడి తుపాకి లాక్కున్నాడు. ఊహించిన ఈ పరిణామానికి ఉగ్రవాది నేలపై పడిపోతాడు, అదే టైంలో ఆ సాధారణ వ్యక్తి ఉగ్రవాది నుంచి లాక్కుతున్న గన్‌తో అతని వైపు గురిపెట్టినట్లు కనిపించింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారని తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
BREAKING: Video shows how bystander disarmed one of the Bondi Beach gunmen pic.twitter.com/YN9lM1Tzls
— The Spectator Index (@spectatorindex) December 14, 2025
READ ALSO: Bapatla Crime: మరీ ఇలా ఉన్నాడు ఏంటి.. బంగారం ఆశ చూపి భార్యను కడతేర్చాడు