Allu Arjun Multiplex: మొన్న మహేష్ బాబుతో కలసి ఏఎంబీ సినిమాస్, నిన్న విజయ్ దేవరకొండతో ఏవీడీ సినిమాస్‌ను ఆరంభించిన ఏషియన్ ఫిలిమ్స్ సంస్థ అల్లు అర్జున్‌తో కూడా చేతులు కలిపిన విషయం తెలిసిందే. నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ దిగ్గజంగా పేరున్న ఏషియన్ ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలంగాణలో మెజారిటీ థియేటర్లను కలిగిఉంది. ఏషియన్ గ్రూప్ ఇప్పటికే పలు మల్టీప్లెక్స్‌తో పాటు అనేక సింగిల్ స్క్రీన్‌లను సొంతంగా నిర్మించటమో లేక లీజ్ కు తీసుకుని ఉండటమో చేస్తోంది. […]
ఐ క్యూ క్రియేషన్స్ పతాకంపై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దోచేవారేవారురా!'. ఈ సినిమా నుంచి తాజాగా 'కల్లాసు అన్ని వర్రీసూ... నువ్వేలే.. నీ బాసూ..' పాటను గుంటూరు మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ మలినేని పెరుమాళ్ళు చేతులు మీదుగా విడుదల చేసారు.
ఏఆర్ మురుగదాస్ పేరు వినగానే తను దర్శకత్వం వహించిన 'గజనీ', 'స్టాలిన్', 'తుపాకి', 'సర్కార్' వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. తెలుగులో తను డైరెక్ట్ చేసింది ఒకే ఒక సినిమా అయినా తను దర్శకత్వం వహించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో రీమేక్ అవటమే, డబ్ అవటమే జరిగాయి.
టాలీవుడ్‌లో సంక్రాంతి 2023 రేస్ రోజురోజుకు ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే తెలుగు బాక్సాఫీస్ వద్ద 'వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తునివు' సినిమాలు ఢీ కొట్టనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సింహాల ఆటలోకి ఓ లేడీ కూడా దూరబోతోంది. అదే 'అన్నీ మంచి శకునములే'.