Anni Manchi Sakunale: టాలీవుడ్‌లో సంక్రాంతి 2023 రేస్ రోజురోజుకు ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే తెలుగు బాక్సాఫీస్ వద్ద ‘వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తునివు’ సినిమాలు ఢీ కొట్టనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సింహాల ఆటలోకి ఓ లేడీ కూడా దూరబోతోంది. అదే ‘అన్నీ మంచి శకునములే’. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ తో నందిని రెడ్డి దర్శకత్వంలో స్వప్న సినిమా పతాకంపై ప్రియాంకదత్, స్వప్నాదత్ నిర్మించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ విడుదల చేయబోతోంది. సంతోష్ శోభన్ ముందు సినిమా ‘లైక్ షేర్ సబ్‌స్క్రైబ్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అయినా స్వప్న సినిమాపై నమ్మకంతో యూవీ క్రియేషన్స్ సంక్రాతి రేస్ లోకి ఈ సినిమాను తీసుకు రానుంది. యువికి ట్రేడ్ లో ఉన్న పరపతితో ఈ సినిమాకు కూడా తగినన్ని థియేటర్లు లభించటం పెద్ద కష్టమేమీ కాదు. దీంతో ‘అన్నీ మంచి శకునములే’ కూడా ఇప్పుడు బడా రేస్ కి రెడీ అయింది. సో టాలీవుడ్ లో 2023 సంక్రాంతి రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోందన్నమాట. చూడాలి ఏం జరుగుతుందో!