NBK108: బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు మూహూర్తం ఫిక్స్ అయింది. గురువారం డిసెంబర్ 8న ఈ సినిమా లాంఛనంగా ఆరంభం కానుంది. 8వ తేదీ ఉదయం 9.36కి మొదలయ్యే ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించనున్నారు. థమన్ సంగీతాన్ని అందించే ఈ సినిమాకు సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.
Hero Allu Arjun: చరణ్ బాటలోనే బన్నీ!?
ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాలో బాలకృష్ణ ఇప్పటి వరకూ పోషించని పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. బాలకృష్ణ ‘అఖండ’కు అద్భుతమైన సంగీతాన్ని అందించిన థమన్ ఈ సినిమాకు ఎవర్ గ్రీన్ హిట్ పాటలను అందించటానికి రెడీ అవుతున్నాడు. ఇందులో నటించే నటీనటుల వివరాలను త్వరలో తెలియచేస్తామంటున్నారు.