Allu Arjun Multiplex: మొన్న మహేష్ బాబుతో కలసి ఏఎంబీ సినిమాస్, నిన్న విజయ్ దేవరకొండతో ఏవీడీ సినిమాస్‌ను ఆరంభించిన ఏషియన్ ఫిలిమ్స్ సంస్థ అల్లు అర్జున్‌తో కూడా చేతులు కలిపిన విషయం తెలిసిందే. నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ దిగ్గజంగా పేరున్న ఏషియన్ ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలంగాణలో మెజారిటీ థియేటర్లను కలిగిఉంది. ఏషియన్ గ్రూప్ ఇప్పటికే పలు మల్టీప్లెక్స్‌తో పాటు అనేక సింగిల్ స్క్రీన్‌లను సొంతంగా నిర్మించటమో లేక లీజ్ కు తీసుకుని ఉండటమో చేస్తోంది. ఇక మహేష్‌తో కలసి ఈ గ్రూప్ నిర్మించిన ఏఎంబీ సినిమాస్ ట్విన్ సిటీస్‌లో క్రేజ్ ఉన్న థియేటర్స్ అనటంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also: Gurthunda Seethakalam Movie Review: గుర్తుందా శీతాకాలం రివ్యూ
అలాగే విజయ్ దేవరకొండ కలయికలో ఏషియన్ సినిమాస్ మహబూబ్ నగర్‌లో నిర్మించిన ఏవీడీ సినిమాస్ ఆ నగరానికే ఆకర్షణ నిలిచాయి. ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలిసి హైదరాబాద్ నడిబొడ్డున ఉండే అమీర్ పేటలో ఏఏఏ సినిమాస్ పేరుతో థియేటర్స్ నిర్మిస్తోంది ఏషియన్ గ్రూప్. గతంలో అమీర్ పేటలో ఉన్న సత్యం థియేటర్‌ను కొనుగోలు చేసి దానిని కూల్చివేసి బన్నీతో కలిసి ఏషియన్ గ్రూప్ మల్టీప్లెక్స్ నిర్మిస్తోంది. ఈ థియేటర్స్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం అయితే సినిమావారికి దగ్గరలో ఉన్న ఏరియా కావటంతో అందరూ ఈ మల్టీప్లెక్స్‌కే క్యూ కట్టటం ఖాయం. మరి ఈ మల్టీప్లెక్స్ అధికారికంగా ఎప్పుడు లాంఛ్ అవుతుందో చూడాలి.