Ketu Moon Eclipse: గ్రహాలు, నక్షత్రరాశుల సంచారం ప్రతిరోజూ శుభ, అశుభ యోగాలను సృష్టిస్తుందని జ్యోతిష్కులు చెబుతుంటారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ యోగాలన్నీ మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అలాంటి అరుదైన, అశుభ యోగం రేపు (నవంబర్ 12న) ఏర్పడబోతోంది. రేపు సింహరాశిలో కేతువు, చంద్రుని కలయిక గ్రహణ యోగాన్ని సృష్టిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ గ్రహణ యోగం కొన్ని రాశుల వారి కెరీర్, వ్యాపారంలో అడ్డంకులను సృష్టించగలదని అభిప్రాయపడ్డారు. ఇది వారి వ్యక్తిగత […]
Indonesia Trishul Project: ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. ఈక్రమంలో ఇండోనేషియా త్రిశూల్ అనే ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశాన్ని దాడుల నుంచి రక్షించుకోవడానికి ప్లాన్ చేస్తుంది. ఇండోనేషియా దేశ రక్షణ వ్యవస్థ కోసం త్రిశూల్ అనే రక్షణ కవచాన్ని అభివృద్ధి చేస్తోంది పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇండోనేషియా తన త్రిశూల్ రక్షణ వ్యవస్థ కోసం సుమారు $125 బిలియన్లు ఖర్చు […]
Faridabad University Raid: తెల్లటి కోటు ధరించిన వ్యక్తులను మానవత్వానికి ప్రతీకగా భావిస్తారు. కానీ ఢిల్లీ పేలుడు తర్వాత వీరు భయానికి కేంద్రంగా మారారు. దేశంలో ఒక వైద్య కళాశాల, ఆసుపత్రి పేరుతో ఒక టెర్రర్ క్లినిక్‌ను గుర్తించారు. అక్కడ చికిత్స పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రాణాలను కాపాడతామని ప్రమాణం చేసిన వారు మృత్యు కాంట్రాక్టర్లుగా మారారు. ఇది సినిమా కథ కాదు, క్రూరమైన ప్రపంచం యొక్క చీకటి నిజం. ఇది ఒక ఉగ్రవాద కర్మాగారం, […]
Battery Safety Tips: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి అరచేతిలో ప్రమాదం గురించి ఎంత మందికి సరైన అవగాహన ఉంది. చాలా మంది రాత్రిపూట ఫోన్‌ను ప్లగ్ చేసి నిద్రపోవడం, దాన్ని 0%కి ఛార్జ్ చేయకుండా వదిలేయడం లేదా పదే పదే 100%కి ఛార్జ్ చేయడం వంటివి చేస్తుంటారు. ఈ ఫోన్ ఛార్జింగ్ అలవాట్లు, సాధారణమైనవిగా అనిపించినప్పటికీ ఇలాంటి పనులు బ్యాటరీకి హానికరం కావచ్చని చెబుతున్నారు. కొన్ని ప్రాథమిక […]
Lionel Messi: 14 ఏళ్ల తర్వాత భారతదేశానికి ఫుట్‌బాల్ రారాజు రాబోతున్నాడు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ. ఆయన గురువారం “GOAT (గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైమ్) టూర్ ఇండియా 2025″లో పాల్గొనడాన్ని అధికారికంగా ధృవీకరించారు. భారతదేశాన్ని “ఫుట్‌బాల్-అభిమాన దేశం”గా అభివర్ణించిన ఆయన, భారత్‌ను మళ్లీ సందర్శించడం తనకు “గౌరవం” అని పేర్కొన్నారు. మెస్సీ 2011లో సాల్ట్ లేక్ స్టేడియంలో వెనిజులాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనాకు కెప్టెన్‌గా చివరిసారిగా […]
Physics Wallah IPO: ప్రముఖ భారతీయ ఎడ్ టెక్ కంపెనీ అయిన PhysicsWallah లిమిటెడ్ IPOను ప్రారంభించింది. పోటీ పరీక్ష, నైపుణ్య అభివృద్ధి కోర్సులకు ప్రసిద్ధి చెందిన ఈ కంపెనీ ఇప్పుడు రూ.3,400 కోట్లకు పైగా సేకరించడానికి సిద్ధమవుతోంది. ఈ IPO నవంబర్ 11 నుంచి 13 వరకు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉండనుంది. ఫిజిక్స్ వాలా IPO మూడు రోజుల పాటు పబ్లిక్ సబ్స్క్రిప్షన్ కోసం తెరిచి ఉంటుంది. కంపెనీ IPO కేటాయింపు నవంబర్ 14న జరిగే […]
Hafiz Saeed: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు దాడి తర్వాత లష్కరే తోయిబా (LeT) నాయకుడు, ఉగ్రవాది హఫీజ్ సయీద్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. పేలుడుకు ఒక రోజు ముందు లష్కరే కమాండర్ సైఫుల్లా వీడియో వైరల్ అయింది. వైరల్ అయిన వీడియోలో సైఫుల్లా మాట్లాడుతూ.. హఫీజ్ సయీద్‌ను మౌనంగా ఉండవద్దని కోరుతూ కనిపించాడు. ఇదే సమయంలో భూటాన్ పర్యాటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఢిల్లీ బాంబ్ పేలుడు సూత్రధారులను విడిచిపెట్టబోమని […]
Islamabad Blast: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్ హైకోర్టు సమీపంలో ఈ పేలుడు సంభవించింది. కోర్టు వెలుపల ఆపి ఉంచిన కారులో ఈ భారీ పేలుడు జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం పేలుడు కారుకే పరిమితమైందని, కానీ తరువాత ఐదుగురు మరణించారని నివేదికలు వెలువడ్డాయి. READ ALSO: IPL 2026: కోల్‌కతాకు రోహిత్ శర్మ.. ముంబై ఇండియన్స్ రియాక్షన్ ఇదే! పలు నివేదికల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో […]
Delhi Car Blast: దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సోమవారం సాయంత్రం పేలుడు దద్దరిల్లింది. ఈ బాంబు పేలుడులో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందగా, 24 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారందరిని ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలికి NIA, NSG బృందాలు చేరుకున్నాయి. ఢిల్లీలో కారు […]
Delhi Terror Attacks: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుడుతో గాయపడిన వారి సంఖ్య దాదాపు 24 మంది ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ పేలుడు 14 సంవత్సరాల తర్వాత ఢిల్లీ శాంతికి విఘాతం కలిగించింది. గతంలో దేశ రాజధాని 2008లో బాంబు పేలుళ్లను చూసింది. భారత రాజధాని అధికార కేంద్రంగా మాత్రమే కాకుండా దేశ భద్రత, శాంతికి చిహ్నంగా […]