ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
- నేడు (జూలై 31) ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి చివరి గడువు..
- ITR ఫైల్ చేసిన రోజే ఈ-వెరిఫికేషన్ చేయడం తప్పనిసరి కాదు..
- టర్న్ ఫైల్ చేసిన తేదీ నుంచి 30 రోజులలోపు ఈ-వెరిఫికేషన్ పూర్తి చేస్తే చాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ITR Filing Deadline: ఆదాయపు పన్ను (Income Tax) రిటర్న్ దాఖలు చేసే గడువు నేటితో (జూలై 31) ముగియనుంది. ఇంకా ITR ఫైల్ చేయని పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా ఈరోజే రిటర్న్ సమర్పించాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. అయితే చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే.. ITR ఫైల్ చేసిన వెంటనే ఈ-వెరిఫికేషన్ కూడా పూర్తిచేయాలా.? లేదా.? అని. అయితే దీనిపై ఆదాయపు పన్ను నిబంధనలు స్పష్టమైన వెసులుబాటును కల్పిస్తున్నాయి.
ITR ఫైల్ చేసిన వెంటనే ఈ-వెరిఫికేషన్ తప్పనిసరా?
లేదు.. జూలై 31లోపు ITR ఫైల్ చేస్తే, అదే రోజున ఈ-వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. రిటర్న్‌ను అప్లోడ్ చేసిన తేదీ నుంచి 30 రోజులలోపు ఈ-వెరిఫికేషన్ పూర్తి చేస్తే, మీ అసలు ఫైలింగ్ తేదీ యథాతథంగా కొనసాగుతుంది. అంటే, మీరు జూలై 31న ITR ఫైల్ చేసి, ఆగస్టులో 30 రోజుల గడువులోపు ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసినా.. మీ రిటర్న్‌ను జూలై 31న ఫైల్ చేసినట్టుగానే పరిగణిస్తారు.
Also Read
30 రోజులు దాటితే.?
ఒకవేళ 30 రోజుల తర్వాత ఈ-వెరిఫికేషన్ చేస్తే.. వెరిఫికేషన్ చేసిన తేదీనే ఫైలింగ్ తేదీగా పరిగణించే అవకాశం ఉంది. దీంతో మీ రిటర్న్ ‘Belated Return’ (ఆలస్యంగా దాఖలు చేసిన రిటర్న్)గా మారవచ్చు. అంతేకాదు, డిసెంబర్ 31, 2026లోపు కూడా ఈ-వెరిఫికేషన్ చేయకపోతే, మీ ITR చెల్లనిదిగా (Invalid Return) పరిగణించే అవకాశం ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఆదాయపు పన్ను శాఖ ఆలస్యాన్ని సముదాయిస్తుంది.
ఈ-వెరిఫికేషన్ ఎలా.?
పన్ను చెల్లింపుదారులు వివిధ మార్గాల్లో సులభంగా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. ఆధార్ OTP, నెట్ బ్యాంకింగ్, Electronic Verification Code (EVC), Digital Signature Certificate (DSC) ద్వారా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. ఈ సదుపాయాలు ఉపయోగించలేని వారు సంతకం చేసిన ITR-V ఫారమ్ ను నిర్ణీత విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.
నిబంధనల ప్రకారం 30 రోజుల గడువు ఉన్నప్పటికీ.. ITR ఫైల్ చేసిన వెంటనే ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయడం ఉత్తమం. దీంతో రిటర్న్ వేగంగా ప్రాసెస్ అవుతుంది. అలాగే Belated Return లేదా Invalid Returnగా మారే ప్రమాదం కూడా ఉండదు. కాబట్టి.. ఇంకా ITR ఫైల్ చేయని వారు జూలై 31లోపు రిటర్న్ సమర్పించి, ఆ తర్వాత 30 రోజులలోపు ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదాయపు పన్ను శాఖ సూచిస్తోంది.
తాజావార్తలు
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
-
Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!