Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- రాముడి గుడిలోనే దగా
- రామ మందిర్‌లో ‘జాబ్ రాకెట్’..
- సిట్ విచారణలో సరికొత్త స్కాం వెలుగులోకి
- 125 మంది నియామకాలపై ‘SIT’ నిఘా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ విరాళాల దొంగతనం కేసు దర్యాప్తులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. విరాళాల చోరీ కేసును ఛేదించే పనిలో ఉన్న దర్యాప్తు సంస్థలకు.. ఆలయ నియామక ప్రక్రియలో జరిగిన ఒక భారీ ‘జాబ్ స్కామ్’ తాలూకు ఆధారాలు చిక్కినట్లు తెలుస్తోంది. రామ మందిరంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిందితులు పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేశారనే ఆరోపణలపై పోలీసులు ఇప్పుడు లోతుగా విచారణ జరుపుతున్నారు.
ట్విస్ట్ ఇచ్చిన నిందితుడి విచారణ..
ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లాను దర్యాప్తు సంస్థలు విచారించగా, కేసు విచారణనే మార్చేసే కీలక విషయాలు బయటపడ్డాయి. విచారణలో రామ్ మందిర్ ట్రస్ట్‌కు చెందిన ఒక ముఖ్య సభ్యుడి పేరు పదేపదే ప్రస్తావనకు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆలయ నియామకాల్లో సదరు ట్రస్ట్ సభ్యుడి పాత్ర ఏమైనా ఉందా? అతని అండతోనే ఆర్థిక అవకతవకలు జరిగాయా? అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
125 నియామకాలపై నిఘా
రామ మందిర ప్రతిష్ఠాన్‌లోని వివిధ విభాగాలలో సుమారు 125 మంది ఉద్యోగులను అక్రమ పద్ధతిలో నియమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. లంచాలు ఇచ్చి ఉద్యోగాలు పొందినట్లు భావిస్తున్న వీరి రికార్డులను పోలీసులు తనిఖీ చేయగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ప్రాథమిక విచారణలో చాలా మంది ఉద్యోగులకు సంబంధించిన అధికారిక నియామక పత్రాలు, సేవా ఒప్పందాలు లేదా ఇతర అవసరమైన డాక్యుమెంట్లు వెంటనే అందుబాటులో లేవని తేలింది. దీంతో ఇవి అక్రమంగా జరిగిన పెద్ద రిక్రూట్మెంట్ నెట్వర్క్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నియామకాలకు అసలు ఏ స్థాయిలో ఆమోదం లభించింది? ఎవరి ఆదేశాల మేరకు వీరంతా విధుల్లో చేరారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు సిట్ బృందం సిద్ధమైంది. అనుమానితుల బ్యాంకు రికార్డులలో ఉద్యోగ నియామకాలకు ముందు, తర్వాత జరిగిన అసాధారణ నగదు బదిలీలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో పేరు వచ్చిన ఆ ట్రస్ట్ సభ్యుడు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అతని ఆస్తుల్లో వచ్చిన మార్పులపై కూడా నిఘా పెట్టినట్లు సమాచారం.
నిందితుల ఫ్యామిలీ కనెక్షన్స్..
ఇప్పటికే విరాళాల దొంగతనం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రాలను కూడా ఈ ఉద్యోగాల స్కామ్ దర్యాప్తులోకి లాగారు. ఈ ఇద్దరు నిందితులకు ట్రస్ట్ సభ్యులతో ఏవైనా కుటుంబ సంబంధాలు ఉన్నాయా, ఆ రికమండేషన్లతోనే ఈ 125 మందికి ఉద్యోగాలు ఇప్పించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నియామక లోపాలు, నిందితుల వాంగ్మూలాలను ‘సిట్’ తన సమగ్ర నివేదికలో పొందుపరచనుంది. ఈ నివేదిక అధికారికంగా బయటకొస్తే అయోధ్య ట్రస్ట్‌లో మరికొన్ని పెద్ద తలకాయల పేర్లు బయటకు రావడం ఖాయమని అంతర్గత వర్గాల సమాచారం.
తాజావార్తలు
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?