Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి 15 ఏళ్ల వయసులోనే ప్రమోషన్ దక్కిన విషయం తెలిసిందే. 2026-27 దేశీయ సీజన్లో జరిగే దులీప్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా బుడ్డోడు ఎంపికయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా.. అతనికి డిప్యూటీగా వైభవ్‌ను నియమించడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు ఈ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తుండగా.. మరోవైపు ఇంత చిన్న వయసులో, ముఖ్యంగా రెడ్‌బాల్ క్రికెట్లో అనుభవం లేని ఆటగాడికి నాయకత్వ బాధ్యతలు ఇవ్వడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
భారత ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘సీనియర్ రెడ్‌బాల్ జట్టుకు కుర్రాడు వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా నియమించడం వెనుక ఉన్న ఆలోచన ఏమిటో తెలుసుకోవాలనిపిస్తోంది. అతడు ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్‌లో 207 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 17.25. అతడి ప్రతిభ అసాధారణమైనదే కానీ.. రెడ్‌బాల్ క్రికెట్లో ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు’ అంటూ ప్రశ్నించాడు. వైభవ్‌కు ఇప్పుడే బాధ్యతలు అవసరమా? అని హర్షా భోగ్లే ప్రశ్నిస్తున్నాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
- BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే జోరుతో ఈస్ట్ జోన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడికి పెద్దగా అనుభవం లేదు. ఇప్పటివరకు ఎనిమిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వైభవ్ 207 పరుగులు మాత్రమే చేశాడు. అందులో అత్యధిక స్కోరు 93. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీ అతడికి రెడ్‌బాల్ క్రికెట్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకునే కీలక వేదికగా మారనుంది. దులీప్ ట్రోఫీలో వైభవ్ ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. మరోవైపు ఈస్ట్ జోన్ బౌలింగ్ విభాగంలో భారత సీనియర్ పేసర్లు మహ్మద్ షమీ, ముఖేశ్ కుమార్ ఉండటం జట్టుకు అదనపు బలంగా మారింది.
వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం భవిష్యత్ నాయకుడిగా అతడిని తీర్చిదిద్దే ప్రయత్నమా? లేదా అతడి అసాధారణ ప్రతిభపై సెలెక్టర్లకు ఉన్న నమ్మకానికి నిదర్శనమా? అన్న చర్చ ఇప్పుడు భారత క్రికెట్లో ఆసక్తికరంగా మారింది. దులీప్ ట్రోఫీలో వైభవ్ తన బ్యాటింగ్‌తో పాటు నాయకత్వ లక్షణాలతోనూ ఆకట్టుకుంటాడా లేదా అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక్కటి మాత్రం చెప్పగలం.. బుడ్డోడు బ్యాటింగ్‌లో అదరగొట్టడం మాత్రం ఖాయం.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!