Maharashtra Politics: కాంగ్రెస్‌లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Politics: మహారాష్ట్ర ప్రతిపక్ష కూటమి (MVA) లో తీవ్ర అనిశ్చితి నెలకొన్న వేళ.. అక్కడ ఊహించని రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP – SP) ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ఇరు పార్టీల నేతల మధ్య అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విలీన ప్రక్రియ గనుక కార్యరూపం దాల్చితే.. మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర స్థాయిలోనే ఏకాభిప్రాయ సాధన
ప్రస్తుతానికి ఈ విలీన చర్చలు ఇరు పార్టీల మహారాష్ట్ర రాష్ట్ర విభాగాల మధ్యే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ (ఎస్పీ) అధిష్ఠానం ముందుగా తమ పార్టీలోని అంతర్గత నేతలు, ఎమ్మెల్యేలతో చర్చించి ఒక స్పష్టమైన ఏకాభిప్రాయానికి రావాలని ప్రయత్నిస్తోంది. అక్కడ రాష్ట్ర స్థాయిలో ఒక స్థూల అవగాహన కుదిరిన తర్వాతే.. తర్వాత తుది నిర్ణయం కోసం ఢిల్లీలోని ఇరు పార్టీల హైకమాండ్ల ముందుకు ఈ ప్రతిపాదనను తీసుకెళ్లనున్నారట. నిజానికి 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ విలీన అంశం చర్చకు వచ్చినప్పటికీ, అప్పట్లో ఎన్నికల ప్రచారం కారణంగా దీనిని హోల్డ్‌లో పెట్టారని సమాచారం.
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
మహా వికాస్ అఘాడీ (MVA) లో అసంతృప్తి
ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) కూటమిలో అంతర్గత విభేదాలు, ఐక్యతపై ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో ఈ సరికొత్త విలీన వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), ఉద్ధవ్ ఠాక్రే శివసేన (UBT) లతో కూడిన ఈ కూటమి.. ఎంపీల తిరుగుబాటుతో ఇప్పటికే కోలుకోలేని దెబ్బతింది. ఇటీవల ముంబైలో జరిగిన ‘మహా వికాస్ అఘాడీ’ సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే బహిరంగంగానే తమ కూటమి ఐక్యతను ప్రశ్నిస్తూ.. “మనం కలిసి ఉన్నామని చెప్పుకుంటున్నాం కానీ.. నిజంగానే మనం కలిసి ఉన్నామా?” అంటూ అసహనం వ్యక్తం చేశారు.
27 ఏళ్ల తర్వాత మళ్లీ..
1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన శరద్ పవార్.. సరిగ్గా 27 ఏళ్ల క్రితం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ని స్థాపించారు. అయితే 2023లో ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ తిరుగుబాటు చేసి పార్టీని చీల్చడంతో.. అసలైన పార్టీ పేరు, గుర్తు అజిత్ పవార్ వర్గానికి దక్కాయి. దీంతో శరద్ పవార్ ‘ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్)’ పేరుతో కొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తమ రాజకీయ భవిష్యత్తు, పార్టీ మనుగడ కోసం శరద్ పవార్ మళ్లీ హస్తం గూటికి చేరేందుకే మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విలీన ప్రతిపాదనపై అధికారిక స్పష్టత వస్తే గనుక మహారాష్ట్రలో విపక్షాల బలం మరింత పెరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!