Gurudwara Demolished: పాకిస్థాన్‌కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurudwara Demolished: పాకిస్థాన్ తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. అక్కడ మైనారిటీల హక్కులను కాలరాస్తూ, వారి పవిత్ర స్థలాలను ధ్వంసం చేస్తూ దారుణమైన చర్యకు పాల్పడింది. పంజాబ్ ప్రాంతంలోని ఫారూఖాబాద్‌లో ఉన్న, సిక్కుల అత్యంత పవిత్రమైన 125 ఏళ్ల నాటి చారిత్రక ‘శ్రీ గురు సింగ్ సభా సాహిబ్’ గురుద్వారాను పాక్ అధికారులు, ల్యాండ్ మాఫియా కలిసి కూల్చివేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతోంది. “పాకిస్థాన్‌కు ఎంత బలుపు ఉంటే ఇంతటి ఘోరానికి ఒడిగడుతుంది” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతుండగా, భారత విదేశాంగ శాఖ పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్థాన్ చేసిన ఈ దుశ్చర్యపై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది.
ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన దాడి
ఈ చారిత్రక గురుద్వారా కూల్చివేతపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం ప్రకటన విడుదల చేస్తూ పాకిస్థాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇది ఒక పవిత్రమైన సిక్కు మత స్థలానికి వ్యతిరేకంగా అత్యంత ఖండించదగిన, ముందస్తు ప్రణాళికతో జరిపిన విధ్వంసం. గురుద్వారాను ధ్వంసం చేయడం తీవ్ర విచారకరం. ఈ ఘటనపై స్థానిక యంత్రాంగం కానీ, అక్కడ మైనారిటీల ఆస్తులను రక్షించాల్సిన ‘ఇవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు’ (ETPB) కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరింత ఆందోళనకరం” అని రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. ఈ పోస్ట్‌లో ఈ సంఘటన ఏదో అనుకోకుండా జరిగిన ఘటన కాదని, పాకిస్థాన్‌లో మైనారిటీలు, వారి పూజా స్థలాలపై నిరంతరం జరుగుతున్న వ్యవస్థీకృత దాడులకు ఇది ప్రత్యక్ష నిదర్శనమని భారత్ బల్లగుద్ది చెప్పింది. ఈ ఘటనపై తక్షణమే నిష్పక్షపాత విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, అలాగే ధ్వంసమైన గురుద్వారాను వెంటనే పునర్నిర్మించాలని భారత్ డిమాండ్ చేసింది. మైనారిటీల రక్షణ విషయంలో పాక్ తన అంతర్జాతీయ, రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చాలని హితవు పలికింది.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
తప్పు ఒప్పుకున్న పాక్ మంత్రి..
ఈ వివాదం అంతర్జాతీయంగా ముదరడంతో పాకిస్థాన్ పంజాబ్ ప్రాంత్ మైనారిటీ వ్యవహారాల మంత్రి రమేష్ సింగ్ అరోరా ఎట్టకేలకు స్పందించారు. 125 ఏళ్ల నాటి గురుద్వారా సింగ్ సభాలోని ఒక భాగాన్ని కూల్చివేసిన మాట నిజమేనని ఆయన అంగీకరించారు. మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతి వేడుకల కోసం పాక్ వెళ్లి వచ్చిన 346 మంది భారత సిక్కు యాత్రికుల బృందానికి మంత్రి రమేష్ సింగ్ అరోరా ఒక హామీ ఇచ్చారు. గురుద్వారాను తక్షణమే ప్రభుత్వ ఖర్చులతో పునర్నిర్మించి, పునరుద్ధరిస్తామని చెప్పారు. ఈ కూల్చివేత వెనుక ఉన్న ‘ల్యాండ్ మాఫియా’ పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన సిక్కు జత్థా సభ్యులకు హామీ ఇచ్చారు. పాక్ ప్రభుత్వం ఈ ల్యాండ్ మాఫియాపై చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.
Our response to media queries regarding reported demolition of 125-year-old Gurdwara in Pakistan ⬇️
🔗 https://t.co/V7QUzNwuRm pic.twitter.com/WpWGONrnIp
— Randhir Jaiswal (@MEAIndia) July 1, 2026
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు