Iran – Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్‌ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran – Israel: మిడిల్ ఈస్ట్‌లో (మధ్యప్రాచ్యం) యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌పై మూడోసారి దాడి జరుగుతుందా? అనే కొత్త భయం ప్రపంచ దేశాలను వణికించేలా చేస్తోంది. గతంలో అమెరికా, ఇరాన్‌లోని మూడు అణు ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపించగా, ఈ ఏడాది ఫిబ్రవరి 28న రెండో విడత భీకర దాడులు జరిగాయి. దీనికి ఇరాన్ కూడా గట్టిగానే బదులిచ్చింది. ప్రస్తుతం అమెరికాతో కుదిరిన తాత్కాలిక ఒప్పందంతో ఇరాన్లో శాంతి నెలకొన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. లోలోపల మూడో రౌండ్ విధ్వంసానికి స్క్రిప్ట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నెతన్యాహు ‘సిక్రెట్ ప్లాన్’..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా చేసిన ప్రకటన ఇరాన్లో మళ్లీ వణుకు పుట్టిస్తోంది. “మా సైన్యం ఇప్పటికే రెండుసార్లు ఇరాన్‌లోకి దూసుకెళ్లి దాడులు చేసింది. అవసరమైతే మూడోసారి కూడా దాడి చేయడానికి వెనుకాడం. నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ చేతికి అణు ఆయుధాలు రానివ్వను” అని నెతన్యాహు ఘాటుగా హెచ్చరించారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కూడా ఇరాన్‌పై మూడో దాడి తప్పదనే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌కు వ్యతిరేకంగా ఒక పెద్ద సైనిక ఆపరేషన్‌కు రెడీ అవుతున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఓ నివేదికలో వెల్లడించింది. ఒకవేళ ఇరాన్ కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, టెహ్రాన్‌పై మళ్లీ బాంబుల వర్షం కురిపించాలని టాప్ అఫీషియల్స్‌తో ట్రంప్ చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఇదే సమయంలో ఇరాన్‌తో అణు కార్యక్రమంపై చర్చలు జరపడానికి కూడా ట్రంప్ అనుమతించారు.
Also Read
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
ఆ రెండు అంశాలు..
‘హోర్ముజ్ జలసంధి’ పూర్తిగా తెరవకపోవడం, అలాగే అణు కార్యక్రమంపై అమెరికా షరతులకు ఇరాన్ లొంగకపోవడం అనే రెండు వివాదాలు అమెరికా-ఇరాన్ మధ్య వివాదానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఇవే మళ్లీ యుద్ధానికి ట్రిగ్గర్ పాయింట్లుగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికాల హెచ్చరికలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘిర్ ఖలీబాఫ్ స్పందిస్తూ.. “మేము శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ అవి విఫలమైతే యుద్ధానికి మేము కూడా సిద్ధమే” అని తేల్చి చెప్పారు. ఒకవేళ ఇరాన్‌పై మూడోసారి దాడి జరిగితే ఆ సెగ ప్రపంచం మొత్తానికి తగలనుంది. ప్రస్తుతం బ్యారెల్‌కు 72 డాలర్లుగా ఉన్న ముడి చమురు ధర ఏకంగా 150 డాలర్లకు చేరుకుంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఇదే కనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోవడంతో పాటు ‘మహా ద్రవ్యోల్బణం’ రావడం ఖాయమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!