Indian Cricketer Mayank Agarwal files police complaint: భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. విమానంలో సీటు ముందున్న ప్లాస్టిక్ కవర్లో మంచినీళ్లుగా భావించి హానికర ద్రవం తాగడంతో తీవ్ర అనారోగ్యంకు గురయ్యాడు. వెంటనే విమానాన్ని ఆపి అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మయాంక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే ఈ ఘటనపై మయాంక్ తన మేనేజర్ సహాయంతో పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశాడు. మయాంక్ […]
Virat Kohli opted out of England Tests: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌లకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల కారణంగా విరాట్ తప్పుకున్నాడని, మిగిలిన మూడు టెస్టులకు అతడు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. అయితే విరాట్ ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండడని సమాచారం తెలుస్తోంది. చివరి మూడు టెస్ట్‌లకు నేడు భారత జట్టును బీసీసీఐ ప్రకటించాల్సి […]
AP Woman racked up Rs 6 lakh bill at Delhi hotel: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్లో బస చేసి.. బిల్లు కట్టే సమయంలో మోసం చేసింది. హోటల్లో బిల్లు దాదాపు రూ. 6 లక్షలు కాగా.. యూపీఐ ద్వారా డబ్బులు పంపినట్లు మోసానికి పాల్పడింది. ఇది తెలుసుకున్న హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ మహిళ బ్యాంకు ఖాతాలో కేవలం 41 రూపాయలు మాత్రమే […]
Heavy Fog in Delhi Today: దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. బుధవారం ఉదయం ఢిల్లీ సహా పొరుగు ప్రాంతాలలో విజిబిలిటీ (దృశ్యమానత) దాదాపు సున్నాకి పడిపోయింది. దాంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వాయు కాలుష్యానికి పొగమంచు కూడా తోడవ్వడంతో ఢిల్లీ జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఉదయం 10-11 గంటలకైనా సూర్యుడి కనిపించడం లేదు. మరోవైపు నేడు, రేపు రాజధానిలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. […]
Husband Pushed His Pregnant Wife from Running Bus in Tamil Nadu: గర్భంతో ఉన్న భార్యను కట్టుకున్న భర్తే కదులుతున్న బస్సులో నుంచి కిందకు తోసేశాడు. గర్భంతో ఉన్న మహిళ రోడ్డుమీద పడి అక్కడిక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఆదివారం (జనవరి 28) చోటుచేసుకుంది. భార్య మృతికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. […]
Kumari Aunty Food Business Closed: ‘కుమారి ఆంటీ’.. ఈ పేరు ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ‘మీది రూ.1000 అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ట్రా’ అనే వీడియోతో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో కుమారి ఆంటీ పేరు మార్మోగిపోయింది. దాంతో హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి దగ్గర స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న కుమారి ఆంటీ బిజినెస్ మరింత ఊపందుకుంది. యువతతో పాటు సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నెట్టింట ప్రచారం […]
Gold and Silver Price in Hyderabad on 2024 January 31st: గత 2-3 రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు మళ్లీ షాక్ ఇస్తున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (జనవరి 31) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,270 గా ఉంది. నిన్నటితో పోలిచ్చుకుంటే.. 22 క్యారెట్ల బంగారంపై రూ.200, 24 క్యారెట్ల బంగారంపై […]
Anil Kumble Says Kuldeep Yadav Have Good Variations: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్.. వైజాగ్‌లో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌పై దృష్టిపెట్టింది. ఫిబ్రవరి 2 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్టుకు స్టార్ ప్లేయర్స్ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయాల కారణంగా దూరమయ్యారు. వీరి స్థానాల్లో సర్ఫారాజ్ ఖాన్, సౌరభ్ […]
Former Pakistan PM Imran Khan sentenced to 10 years in jail: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇమ్రాన్ అధికారంలో ఉన్నప్పుడు దేశ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు దోషిగా నిర్ధారించిన కోర్టు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్ సన్నిహితుడు, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి కూడా ఇదే కేసులో పదేళ్ల శిక్ష […]
IND vs ENG 2nd Test Prdicted Playing 11: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్.. రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమిని ఎదుర్కొన్న రోహిత్ సేన.. వైజాగ్ టెస్టులో మార్పులతో బరిలోకి దిగనుంది. ఉప్పల్ టెస్టులో మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడిన నేపథ్యంలో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ రెండో టెస్ట్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. […]