Mayank Agarwal: విమానంలో తీవ్ర అస్వస్థత.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మయాంక్ అగర్వాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Cricketer Mayank Agarwal files police complaint: భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. విమానంలో సీటు ముందున్న ప్లాస్టిక్ కవర్‌లో మంచినీళ్లుగా భావించి హానికర ద్రవం తాగడంతో తీవ్ర అనారోగ్యంకు గురయ్యాడు. వెంటనే విమానాన్ని ఆపి అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మయాంక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే ఈ ఘటనపై మయాంక్ తన మేనేజర్ సహాయంతో పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశాడు.
మయాంక్ అగర్వాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘మయాంక్ అగర్వాల్ అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్. అతడి ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉంది. అయితే మయాంక్ మేనేజర్ ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఎన్సీసీపీఎస్ (న్యూ క్యాపిటల్ కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్)కి ఫిర్యాదు చేసారు’ అని ఎస్పీ వెస్ట్ త్రిపుర కిరణ్ కుమార్ తెలిపారు. ‘మయాంక్ విమానంలో కూర్చున్నప్పుడు అతని ముందున్న ద్రవాన్ని కొద్దిగా తాగాడు. అకస్మాత్తుగా అతని నోటిలో ఇబ్బంది మొదలైంది. ఒక్కసారిగా అతను మాట్లాడలేకపోయాడు. మయాంక్ నోటిలో వాపు మరియు బొబ్బలు వచ్చాయి. ప్రస్తుతం మయాంక్ ఆరోగ్యం నిలకడగా ఉంది’ అని మయాంక్ మేనేజర్ పోలీసులకు తెలిపాడు.
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
Also Read: IND vs ENG: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. విరాట్ కోహ్లీ దూరం!
రంజీట్రోఫీలో భాగంగా త్రిపుర జట్టుతో మ్యాచ్ ఆడటకం కోసం కర్ణాటక టీమ్ అగర్తాలకు వచ్చింది. మ్యాచ్ అనంతం అగర్తల నుంచి కర్ణాటక కెప్టెన్ అయిన మయాంక్ అగర్వాల్ ఢిల్లీకి ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో బయలుదేరాడు. సీటు ముందున్న కవర్ (పౌచ్)లోని బాటిల్‌లో ఉన్న ద్రవాన్ని మంచి నీళ్లుగా భావించి తాగాడు. కొద్దిసేపటికే మయాంక్ తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. వాంతులు, గొంతు వాపు, బొబ్బలతో ఇబ్బందిపడ్డాడు. మెడికల్ ఎమర్జెన్సీతో విమానం వెనక్కి రాగా.. హుటాహుటిన అతడిని ఆస్పుత్రిలో చేర్చారు. ఐసీయూలో చికిత్స అనంతరం అతడి ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. వైద్యుల సూచనల మేరకు మయాంక్‌ను బెంగళూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!