IND vs ENG 2nd Test Prdicted Playing 11: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్.. రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమిని ఎదుర్కొన్న రోహిత్ సేన.. వైజాగ్ టెస్టులో మార్పులతో బరిలోకి దిగనుంది. ఉప్పల్ టెస్టులో మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడిన నేపథ్యంలో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ రెండో టెస్ట్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. టీమిండియాలో సర్ఫరాజ్ ఎంట్రీ దాదాపుగా ఖరారైపోయినట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో శుభ్‌మన్ గిల్ టెస్టులలో వరుసగా విఫలవుతున్నాడు. దాంతో గిల్ ఆడుతున్న వన్‌డౌన్‌లో దేశవాళీ సంచలనం రజత్ పాటిదార్‌ను బరిలోకి దించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోందట. రెండో టెస్ట్‌లో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా బరిలోకి దిగనున్నాడని సమాచారం. కండరాల సమస్యతో బాధపడుతున్న రవీంద్ర జడేజా స్థానంలో సుందర్ ఆడనునట్లు తెలుస్తుంది. విశాఖ టెస్ట్‌లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
Also Read: IND vs ENG: చివరి 3 టెస్టులకు జట్టు ఎంపిక.. విరాట్ కోహ్లీ తిరిగి వస్తాడా?
సర్ఫరాజ్ ఖాన్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 66 ఇన్నింగ్స్‌ల్లో 69.85 సగటుతో 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో 3912 పరుగులు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. మరోవైపు రజత్ పాటిదార్ 55 మ్యాచ్‌ల్లో 45.97 సగటుతో 4000 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభంకానుంది.
భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, పాటిదార్, సర్ఫరాజ్, అయ్యర్, కేఎస్ భరత్ (కీపర్), అక్షర్, సుందర్, అశ్విన్, బుమ్రా, సిరాజ్.