Rishabh Pant levels with Dinesh Karthik IPL Record: రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత రిషబ్ పంత్ మైదానంలో అడుగుపెట్టాడు. అతనెలా ఆడతాడో అని అందరిలో ఎన్నో సందేహాలు ఉన్నాయి. కానీ ఐపీఎల్ 2024లో పంత్ అదరగొడుతున్నాడు. బ్యాటర్‌గా ఇప్పటికే మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్.. బుధవారం గుజరాత్ టైటాన్స్‌పై కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా గొప్ప నైపుణ్యం చూపించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో అరుదైన ఘనత సాధించాడు. […]
KKR Skipper Shreyas Iyer fined Rs 12 lakh in KKR vs RR: రాజస్తాన్ రాయల్స్‌పై ఓడి బాధలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు షాక్ తగిలింది. రాయల్స్‌పై స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఈ మేరకు ఐపీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ 2024లో కేకేఆర్ స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇదే మొదటిసారి కాబట్టి […]
Harbhajan Singh on Jos Buttler Centuryin IPL 2024: రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌పై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. బట్లర్ ప్రత్యేకమైన, అసాధారణ ఆటగాడు అని పేర్కొన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై బట్లర్ చేసిన సెంచరీ అద్భుతం అని, భారత క్రికెటర్ల వలె అతడి శతకం సెలెబ్రేషన్స్ కూడా మనం చేసుకోవాలన్నారు. మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతాపై బట్లర్ వీరోచిత శతకం బాదాడు. చివరి బంతి వరకు […]
Krishnamachari Srikkanth on RCB Bowlers: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలర్లు స్థాయికి తగ్గట్టుగా రాణించడం లేదు. ప్రతి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో భారీగా పరుగులు ఇచ్చారు. ఎంతలా అంటే ఆర్సీబీ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ.. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు 287 రన్స్ చేశారు. దాంతో ఆర్సీబీ బౌలింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆర్సీబీ బౌలింగ్‌పై భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి […]
Riyan Parag in T20 World Cup 2024 India Squad: టీ20 ప్రపంచకప్ 2024కు సమయం ఆసన్నమవుతోంది. ఐపీఎల్ 2024 అనంతరం మెగా టోర్నీ ఆరంభం కానుంది. జూన్ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్ జరగనుంది. టీ20 ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేసేందుకు మే 1 చివరి తేదీ. దాంతో త్వరలోనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకోసం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ […]
Surya Tilak on Ram Lalla’s Forehead: నేడు ‘శ్రీరామ నవమి’. ఈ సందర్భంగా యూపీలోని అయోధ్య ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి. ఈ శ్రీరామ నవమి అయోధ్యకు ప్రత్యేకమైనది. ఎందుకంటే.. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇదే తొలి నవమి. శ్రీరామ నవమి సందర్భంగా రామ్‌లల్లా దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అయోధ్య ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్య కిరణాలు బాల రాముడికి […]
UPSC Civils 3rd Ranker Ananya Reddy on Virat Kohli: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2023లో తెలంగాణకు చెందిన దోనూరు అనన్య రెడ్డి సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే తన అసాధారణ ప్రతిభతో ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించారు. ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే.. సొంతగా రెండేళ్లు కష్టపడి ఈ ఘనతను సాధించడం విశేషం. ప్రస్తుతం అనన్యపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అనన్య తన ప్రయాణం గురించి చెపుతూ.. తాను ఆంత్రోపాలజీకి మాత్రమే […]
Rahul Gandhi Gave update on Amethi Seat: లోక్‌సభ ఎన్నికలు 2024లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేదెవరనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కంచుకోటగా ఉన్న అమేథీ స్థానం నుంచి బీజేపీ తరఫున కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మళ్లీ పోటీ చేస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా.. కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అయితే అమేథీ స్థానంపై రాహుల్ గాంధీ […]
Anand Mahindra Tweet on Dubai Rains 2024: సాధారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఎండలు ఎక్కువ. ఎడారి దేశం కాబట్టి అక్కడ వర్షాలు తక్కువే. ఎప్పుడో కానీ.. భారీ వర్షాలు కురవవు. అలాంటి యూఏఈలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం (ఏప్రిల్ 16) బలమైన గాలులు, ఉరుములు-మెరుపులతో భారీ వర్షం కురిసింది. దాంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాల వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. దుబాయ్‌లో అయితే ఈ వర్ష బీభత్సం మరీ […]
Jos Buttler Says MS Dhoni and Virat kohli is my inspiration: భారత బ్యాటింగ్ దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలే తనకు ఇన్స్పిరేషన్ అని ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్ తెలిపాడు. ధోనీ, కోహ్లీలను చూసే చివరి వరకు క్రీజులో ఉండటం తాను నేర్చుకున్నాడన్నాడు. తాను ఎక్కువగా గోల్ఫ్ చూస్తానని, మాక్స్ హోమ్స్ అనే వ్యక్తిని బాగా ఫాలో అవుతానని చెప్పాడు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు పోరాడకుండా నిర్లక్ష్యపు షాట్‌తో వికెట్ పారేసుకోవద్దని […]