KKR Skipper Shreyas Iyer fined Rs 12 lakh in KKR vs RR: రాజస్తాన్ రాయల్స్‌పై ఓడి బాధలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు షాక్ తగిలింది. రాయల్స్‌పై స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఈ మేరకు ఐపీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ 2024లో కేకేఆర్ స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇదే మొదటిసారి కాబట్టి అయ్యర్‌కు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానాతో సరిపెట్టారు. ఐపీఎల్ 2024లో ఇప్పటికే ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, రాజస్థాన్ సారథి సంజు శాంసన్‌కు జరిమానా పడింది.
‘రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో చేసిన కేకేఆర్ మొదటి నేరం ఇదే. కాబట్టి కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించబడింది’ అని ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. మ్యాచ్‌లు సజావుగా జరిగేలా మరియు షెడ్యూల్ చేసిన సమయంలో మ్యాచ్ పూర్తి కావడానికి ఐపీఎల్ నిబంధనలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024లో కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన ఆరు గేమ్‌లలో 4 విజయాలు సాధించి.. 8 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. మిగిలిన 8 గేమ్‌లలో మరో నాలుగు గెలిస్తే ప్లే ఆఫ్స్ ఖాయం. కేకేఆర్ జోరు చూస్తే.. ప్లే ఆఫ్స్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: Jos Buttler Century: ధోనీ, కోహ్లీవి మాత్రమే కాదు.. బట్లర్ సెలెబ్రేషన్స్ కూడా మనం చేసుకోవాలి!
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఓ సీజన్‌లో మొదటిసారి స్లో ఓవర్ రేటు నమోదు చేస్తే టీమ్ కెప్టెన్‌కు రూ.12 లక్షల జరిమానా పడుతుంది. రెండోసారి రిపీట్ అయితే కెప్టెన్‌కు రూ.24 లక్షలు ఫైన్, జట్టులోని ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు. ఇక మూడోసారి ఇదే పునరావృతమైతే కెప్టెన్‌కు రూ.30 లక్షల జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధించబడుతుంది. అంతేకాకుండా ఆటగాళ్లకు రూ.12 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానా విధించబడుతుంది.