Rishabh Pant levels with Dinesh Karthik IPL Record: రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత రిషబ్ పంత్ మైదానంలో అడుగుపెట్టాడు. అతనెలా ఆడతాడో అని అందరిలో ఎన్నో సందేహాలు ఉన్నాయి. కానీ ఐపీఎల్ 2024లో పంత్ అదరగొడుతున్నాడు. బ్యాటర్‌గా ఇప్పటికే మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్.. బుధవారం గుజరాత్ టైటాన్స్‌పై కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా గొప్ప నైపుణ్యం చూపించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించాడు.
Also Read: Raghu Babbu : నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్‌ఎస్ నేత మృతి
ఓ ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు సాధించడంలో భాగస్వామ్యమైన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ చరిత్రకెక్కాడు. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో నలుగురును ఔట్ చేయడంలో పంత్ సహకరించాడు. అతడు రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్‌లు అందుకున్నాడు. దీంతో 2009లో రాజస్థాన్ రాయల్స్‌పై దినేశ్ కార్తీక్ (4) సాధించిన రికార్డు సమమైంది. ఐపీఎల్ 2008, 2009, 2010 సీజన్లలో అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు డీకే ఆడిన విషయం తెలిసిందే.