Harbhajan Singh on Jos Buttler Centuryin IPL 2024: రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌పై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. బట్లర్ ప్రత్యేకమైన, అసాధారణ ఆటగాడు అని పేర్కొన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై బట్లర్ చేసిన సెంచరీ అద్భుతం అని, భారత క్రికెటర్ల వలె అతడి శతకం సెలెబ్రేషన్స్ కూడా మనం చేసుకోవాలన్నారు. మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతాపై బట్లర్ వీరోచిత శతకం బాదాడు. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో బట్లర్ ఒంటిచేత్తో రాజస్తాన్‌ను గెలిపించాడు. బట్లర్ బ్యాటింగ్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
Also Read: RCB Bowlers: విరాట్ కోహ్లీనే తక్కువ రన్స్ ఇస్తాడేమో.. ఆర్‌సీబీపై శ్రీకాంత్ సెటైర్లు!
స్టార్ స్పోర్ట్స్‌లో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ… ‘జోస్ బట్లర్ ఒక ప్రత్యేక ఆటగాడు. అతను వేరే స్థాయి ఆటగాడు. బట్లర్ మొదటిసారి ఇలా ఆడలేదు. ఇలాంటి ఇన్నింగ్స్ చాలా సార్లు ఆడాడు. మున్ముందు కూడా ఇలానే ఆడుతాడు. అసాధారణమైన ప్రతిభ అతడి సొంతం. బట్లర్ అద్భుతమైన ఆటగాడు అయినా.. అతని గురించి మనం ఎక్కువగా మాట్లాడం. ఎందుకంటే అతను భారత ఆటగాడు కాదు. ఒకవేళ ఇదే సెంచరీ విరాట్ కోహ్లీ చేస్తే.. కనీసం రెండు నెలల పాటు అతడిని ప్రశంసిస్తూ ఉండేవాళ్లం. ఎంఎస్ ధోనీ కొట్టిన 3-4 సిక్సర్ల గురించి కూడా మనం పెద్ద ఎత్తున చర్చిస్తాం. మన ప్లేయర్ల సెంచరీ, సిక్సర్లలను సెలబ్రేట్ చేసుకున్నట్లుగానే.. బట్లర్ శతకంను కూడా సంబరాలు చేసుకోవాలి. ఎందుకంటే అతడు కూడా ఓ క్రికెట్ లెజెండ్’ అని అన్నారు.