Dubai Rains: ఇది ముంబై కాదు దుబాయ్.. ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం కొన్ని గంటల్లోనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Mahindra Tweet on Dubai Rains 2024: సాధారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఎండలు ఎక్కువ. ఎడారి దేశం కాబట్టి అక్కడ వర్షాలు తక్కువే. ఎప్పుడో కానీ.. భారీ వర్షాలు కురవవు. అలాంటి యూఏఈలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం (ఏప్రిల్ 16) బలమైన గాలులు, ఉరుములు-మెరుపులతో భారీ వర్షం కురిసింది. దాంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాల వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. దుబాయ్‌లో అయితే ఈ వర్ష బీభత్సం మరీ ఎక్కువగా ఉంది. ఎంతలా అంటే.. ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం కొన్ని గంటల్లోనే కురిసింది.
దుబాయ్‌లో సోమవారం (ఏప్రిల్ 15) అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దాంతో దుబాయ్‌లో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద ధాటికి ప్రధాన రహదారిలో కొంత భాగం కొట్టుకుపోయింది. దుబాయ్‌లో 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షంతో నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపైకి భారీగా నీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయి.. ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయారు. నీటిలో విమానాలు ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read
- Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
Also Read: KKR vs RR: ధోనీ, కోహ్లీలే నా ఇన్స్పిరేషన్: జోస్ బట్లర్
దుబాయ్‌లో వర్షపు నీరు రోడ్లపై పరుగులు పెడుతోంది. ఆ నీటిలోనే వాహనాలు నెమ్మదిగా వెళుతున్నాయి. మరోవైపు అధికారులు నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. దుబాయ్‌కు సంబందించిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ‘ఇది ముంబై కాదు.. దుబాయ్’ అని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఓ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. రాతి ఎడారిగా పేరున్న ఎమిరేట్ ఆఫ్ ఫుజైరాలో కూడా 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యూఏఈలో ఈ స్థాయి వర్షాలు చాలా చాలా అరుదు. కానీ గత 2-3 ఏళ్లుగా ఇలా కుంభవృష్టి కురుస్తోంది. వాతావారణ మార్పుల ప్రభావంతోనే ఈ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు అంటున్నారు.
Nope.
Not Mumbai.
Dubai…
— anand mahindra (@anandmahindra) April 16, 2024
తాజావార్తలు
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!