టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్, కడప అమ్మాయి నల్లపురెడ్డి శ్రీ చరణి ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగా.. శ్రీ చరిణికి మంత్రులు అనిత, సంధ్యా రాణి, ఏసీఏ చైర్మన్ కేశినేని చిన్ని సహా మాజీ క్రికెటర్లు మిథాలీ రాజ్, ఎంఎస్కే ప్రసాద్ స్వాగతం పలికారు. మహిళా క్రికెట్ టీమ్ క్రీడాకారిణి శ్రీ చరిణికి పుష్పగుచ్చం ఇచ్చి.. శాలువా కప్పి ఘనంగా అసత్కరించారు. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 గెలిచిన శ్రీ చరణికి […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీని విక్రయించే అవకాశం ఉంది. ఆర్సీబీ ఫ్రాంచైజీ విక్రయ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఐపీఎల్ 2026కి ముందే ఫ్రాంచైజీని విక్రయించే అవకాశం ఉందని డియాజియో పీఎల్‌సీకి చెందిన భారత అనుబంధ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్) బుధవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)కి ఓ లేఖ రాసింది. ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టే వారి కోసం […]
ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో అంధకారం అలముకుంది. దాదాపు 10 గంటల పాటు పేషెంట్లు తీవ్ర అవస్థలు పడ్డారు. బాలింతలు గర్భిణీలు చంటి పిల్లలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. మొబైల్ వెలుతురులో వైద్యం అందిస్తూ, కొవ్వొత్తుల వెలుగులో విధులు నిర్వహిస్తూ నర్సింగ్ సిబ్బంది కూడా పడరాని పాట్లు పడ్డారు. ఉత్తరాంధ్ర పెద్దాసుపత్రికి గ్రహణం పట్టింది. మధ్యాహ్నం నుంచి విద్యుత్ నిలిచిపోవడంతో రోగులతో కిటకిటలాడే వార్డులన్నీ అంధకారంలో మగ్గిపోయాయి. చిమ్మ చీకటిలో రోగులు అల్లాడిపోయారు. రాజేంద్రప్రసాద్ […]
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచిన భారత జట్టు సభ్యురాలు, తెలుగు క్రికెటర్ అరుంధతి రెడ్డి గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అరుంధతి రెడ్డి ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలవడం సంతోషాన్ని ఇచ్చింది. దేశమంతా సంబరాలు జరుపుకున్నారు. భవిష్యత్తులో మహిళా క్రికెటర్లకు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. మహిళలు ఎందులోనూ తక్కువ […]
ఇవాళ తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 11.05 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరులోని తన నివాసానికి చేరుకోనున్న జగన్ నేడు విజయవాడ నగరానికి రానున్న మహిళల ఇండియన్ క్రికెట్ టీమ్ క్రీడాకారిణి శ్రీ చరిణి.. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీ ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబుని కలవనున్న ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి.. […]
వృషభ రాశి వారికి నేడు అన్ని ప్రతికూలంగా ఉంటాయి. ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయి. అనుకోకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనతో వ్యవహరించే అవకాశాలు కనిపిస్తన్నాయి. ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహా విష్ణువు. నేడు మీరు చేయాల్సిన పూజ విష్ణు శాస్త్రనామ స్తోత్రంను పారాయణం చేయాలి. ఈక్రింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. శ్రీ రాయప్రోలు మల్లికార్జునశర్మ […]
ప్రభుత్వంలోని కొందరు ఐఏఎస్‌లపై ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారా? పనితీరు మెరుగు పరుచుకోవాలని పలుమార్లు సూచించినా ఆ ఐఏఎస్ లు పట్టించుకోవడం లేదా? విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్న ఐఏఎస్‌ల జాబితాను సీఎంవో సిద్ధం చేసిందా? తొందరలోనే ఆ ఐఏఎస్ లకు స్థాన చలనం తప్పదా?. తెలంగాణ ప్రభుత్వంలోని కొందరు ఐఏఎస్ ల వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వున్నారని సెక్రటేరియట్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి […]
మాటల తూటాలు పేలుతున్నాయి. డైలాగ్‌లు ఆటంబాంబుల్లా రీసౌండ్‌నిస్తున్నాయి. ఎన్నికల్లో హీట్ పెంచడానికి కొందరు నేతలు వాడుతున్న అభ్యంతకర భాష శ్రుతిమించుతోందా?.. జూబ్లీహిల్స్ ఎన్నికలో మూడు పార్టీల పెద్ద నాయకుల లాంగ్వేజ్ హద్దు దాటుతోందా? జూబ్లీహిల్స్ పోలింగ్ దగ్గరపడేకొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. గల్లీగల్లీ చుట్టేస్తూ..రోడ్ షోలు నిర్వహిస్తూ లీడర్లు డైలాగ్ డోస్ పెంచుతున్నారు. అంతవరకు బాగానే ఉన్నా…లాంగ్వేజ్‌ని మరో లెవెల్ కి తీసుకెళ్లడమే క్యాంపెయిన్ తీరును మార్చేస్తోంది. ఒకరిని మించి ఒకరు మాటల స్థాయిని దిగజారేస్తున్నారు. ఒకప్పుడు […]
తెలంగాణ యూనివర్సిటీ 2012 నియామకాలపై హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. యూనివర్సిటీలో 2012 నియామకాలు చెల్లవంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2012లో జారీ చేసిన నోటిఫికేషన్‌పై హైకోర్టు విచారణ జరిపి ఈ మేరకు తీర్పును వెల్లడించింది. తాజా తీర్పు కారణంగా 45 మందికి పైగా ప్రొఫెసర్లు ఉద్యోగాలను కోల్పోనున్నారు. తెలంగాణ యూనివర్సిటీ కొత్త నోటిఫికేషన్లు జారీ చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. Also Read: T20 World Cup 2026: అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్.. పాక్ […]