క్వీన్స్‌లాండ్‌లో ఆస్ట్రేలియా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 రన్స్ చేసింది. ఆసీస్ విజయ లక్ష్యం 168 రన్స్. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (46; 39 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్. అభిషేక్ శర్మ (28), శివమ్ దూబే (22), సూర్యకుమార్ యాదవ్ (20), అక్షర్ పటేల్ (21) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎలిస్, ఆడమ్ జంపా తలో […]
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా.. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా అక్టోబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుండగా.. 14న తమిళ, మలయాళ, కన్నడలో భాషల్లో విడుదల అవనుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ విత్ జగపతి కార్యక్రమంలో […]
‘కింగ్ అవ్వుడు సంగతి పక్కనపెట్టు.. ముందు డిపాజిట్ తెచ్చుకో’ అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, కేటీఆర్ వేరు కాదని.. ఇద్దరు నాణెంకు ఉండే బొమ్మ బొరుసు లాంటి వాళ్లే అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు సీబీఐకి ఇవ్వు అని చెప్పిన కిషన్ రెడ్డి.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కిషన్ రెడ్డి.. నీకు ఎవడు భయపడడు అని సీఎం రేవంత్ అన్నారు. […]
బాబాయ్-అబ్బాయ్ బ్యాక్ టు బ్యాక్ థియేటర్లోకి రాబోతున్నారా? అంటే.. అవుననే మాట వినిపిస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ ఇప్పటికే జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ షాట్ సెన్సేషనల్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ మాస్ లుక్ కేక పెట్టించేలా ఉంది. దీంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పెద్ది సినిమాను 2026 మార్చి 27న రిలీజ్ చేయబోతున్నారు. […]
విశాఖ ఆర్కే బీచ్ (రామకృష్ణ బీచ్) సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేసింది. భారీ అలలతో ఎగిసిపడే సముద్రం బాగా వెనక్కి వెళ్లింది. దీంతో నీలి సముద్రంపు కెరటాల మధ్య చిక్కుకుపోయిన శిలలు బయటపడ్డాయి. బ్రిటీష్ కాలం నాటిదిగా భావించే బంకర్ సైతం వెలుగులోకి వచ్చింది. అలలు తగ్గడంతో భారీ రాళ్లు ఎక్కి సందర్శకులు సందడి చేశారు. సెల్ఫీలు, రీల్స్ చేస్తూ హడావిడిగా కనిపించారు. Also Read: Pawan Kalyan: 75 ఏళ్ల తర్వాత విద్యుత్ కనెక్షన్.. పవన్ […]
అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీ గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ వెలుగులు వెలిగాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత మొదటిసారి విద్యుత్ కనెక్షన్ వచ్చింది. 17 కుటుంబాలు నివసించే గూడెంకి 9.6 కి.మీ పొడవున 217 విద్యుత్ స్తంభాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వం తరఫున 5 బల్బులు, ఒక ఫ్యాన్ అందించారు. సుమారు రూ.80 లక్షల వ్యయంతో పర్వత అడవి ప్రాంతంలో […]
ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ని విమర్శించే స్థాయి ఆదినారాయణ రెడ్డికి లేదన్నారు. అధికారం లేకపోతే పిల్లిలా ఉండే ఆదినారాయణ రెడ్డి.. ఇప్పుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అవసరాన్ని బట్టి పార్టీలు మార్చే వ్యక్తి అని విమర్శించారు. చికెన్ షాపుల్లో కూడా కమీషన్లు కొట్టేసే స్థాయి ఆదినారాయణ రెడ్డిది అని ఎద్దేవా చేశారు. జగన్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటానికి […]
‘మాస్ మహారాజా’ రవితేజ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. ‘ధమాకా’ తర్వాత చేసిన సినిమా లేవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. రీసెంట్గా వచ్చిన ‘మాస్ జాతర’ సినిమా కూడా ఫ్లాప్ లిస్ట్‌లో పడిపోయింది. ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల కాంబినేషన్ రిపీట్ అవడం ఒకటైతే.. టైటిల్ మాస్ జాతర అని ఉండడంతో మంచి అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ రొటీన్ కథ, కథనంతో రవితేజ తన ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేశారు. దీంతో అప్ కమింగ్ ఫిల్మ్స్‌తో […]
తుఫాన్ నష్టం, అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్, జిల్లా అటవీశాఖ అధికారులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. కృష్ణా నదిపై హై లెవెల్ […]
టాలీవుడ్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లలో ‘స్పిరిట్’ మోస్ట్ అవైటేడ్ మూవీగా రాబోతోంది. రెబల్ స్టార్ ప్రభాస్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎలా చూపిస్తాడా? అనే ఎగ్జైట్మెంట్ అందరిలోనూ ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న సందీప్.. తాజాగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇదే నెలలో రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, కాంచన వంటి […]