తెలంగాణ యూనివర్సిటీ 2012 నియామకాలపై హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. యూనివర్సిటీలో 2012 నియామకాలు చెల్లవంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2012లో జారీ చేసిన నోటిఫికేషన్‌పై హైకోర్టు విచారణ జరిపి ఈ మేరకు తీర్పును వెల్లడించింది. తాజా తీర్పు కారణంగా 45 మందికి పైగా ప్రొఫెసర్లు ఉద్యోగాలను కోల్పోనున్నారు. తెలంగాణ యూనివర్సిటీ కొత్త నోటిఫికేషన్లు జారీ చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
Also Read: T20 World Cup 2026: అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్.. పాక్ తుది పోరుకు వస్తే మాత్రం..!
2012లో 91 పోస్టులకు తెలంగాణ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ సమయంలో విడుదలైన నోటిఫికేషన్‌లో చేర్చాల్సిన పోస్టులు చేర్చకపోవడం, చేర్చకూడని పోస్టులు చేర్చడంతో పిటిషనర్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దాఖలపై పిటిషన్లపై హైకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఎట్టకేలకు ఈరోజు హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. ఇక సబ్జెక్టుల రోస్టర్ పాయింట్లు మారిపోయాయని హైకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకువెళ్లారు. హైకోర్టు తీర్పుతో ఉద్యోగాలను కోల్పోనున్న ప్రొఫెసర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు.