మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదాడు. సూరత్‌లోని పితావాలా స్టేడియంలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో ఆకాష్ 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ కూడా. ఈ క్రమంలో వేన్ వైట్ రికార్డును ఆకాష్ బద్దలు కొట్టాడు. 2012లో ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్ తరఫున […]
కార్తీకమాసం సందర్భంగా భక్తి టీవీ, ఎన్టీవీ ఆధ్వర్యంలో 2025 ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. విశేష పూజలు, అనుగ్రహ భాషణం, కళ్యాణం, ప్రవచనాలు, వాహన సేవలతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. నవంబర్ 1న ప్రారంభమైన కోటి దీపోత్సవం.. విజవంతంగా కొనసాగుతూ భక్తుల మన్ననలు అందుకుంటోంది. కోటి దీపోత్సవంలో నేడు 10వ రోజు. నేటి విశేష కార్యక్రమాలు ఏంటో […]
భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ 2025ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించిన టీమిండియా.. ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చుకుంది. కప్ గెలిచి వారం అవుతున్నా.. సంబరాలు మాత్రం ఇంకా ఆగలేదు. క్రికెటర్ల సొంత రాష్ట్రాలు ఘనంగా సత్కరిస్తూ.. రివార్డులు, అవార్డులు ప్రకటిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్లేయర్ క్రాంతి గౌడ్‌ను సత్కరించింది. అంతేకాదు క్రాంతి కోరిక మేరకు బర్తరఫ్ అయిన ఆమె తండ్రిని తిరిగి పోలీసుగా పునర్నియమిస్తామని […]
టీమిండియా మహిళా వికెట్ కీపర్ రిచా ఘోష్‌పై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2025లో అద్భుతంగా ఆడిందని కొనియాడారు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం ఎంతో కష్టమని, తీవ్ర ఒత్తిడిలో కూడా తక్కువ బంతుల్లోనే భారీగా పరుగులు చేసిందన్నారు. రిచాకు 22 ఏళ్లే అని, ఎంతో భవిష్యత్ ఉందన్నారు. రిచా.. ఏదో ఓరోజు భారత కెప్టెన్ కావాలని తాను ఆశిస్తున్నట్లు గంగూలీ చెప్పారు. వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత […]
భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్.. లింగమార్పిడి చేయించుకున్న విషయం తెలిసిందే. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) తర్వాత అమ్మాయిగా మారాడు. తన పేరును ‘అనయ బంగర్’గా మార్చుకున్నాడు. అనయగా మారిన అనంతరం సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ.. తన పరివర్తన గురించి డీటైల్స్ పంచుకుంది. ఆ మధ్య రియాలిటీ షోలో కూడా పాల్గొంది. తాజాగా అనయ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అనయ పాల్గొనడం […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం కోసం నవంబర్ 15 లోపు రిటైన్ లిస్ట్ ప్రకటించాలని 10 ఫ్రాంచైజీలకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిలీజ్ లిస్టుపై ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. తుది గడువుకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఫ్రాంచైజీలు రిలీజ్ చేసే ప్లేయర్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో చెన్నై […]
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ‘యాపిల్’ తన రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్లైన ఐఫోన్ 18 సిరీస్‌ను వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. 18 సిరీస్ లాంచ్‌కు ఇంకా 10 నెలల సమయం ఉంది. అయినా ఇప్పటి నుంచే ఫీచర్స్ లీక్ అవ్వడం ప్రారంభమయ్యాయి. యాపిల్ కంపెనీ ఈ సిరీస్ ఫోన్లను సరికొత్త రియర్ డిజైన్‌తో లాంచ్ చేయవచ్చు. అదనంగా ఐఫోన్ 18 ప్రో సిరీస్ మూడు కొత్త కలర్ ఆప్షన్లలో రానున్నట్లు […]
2016లో వచ్చిన బొమ్మల రామారం సినిమాతో ‘తిరువీర్’ వెండి తెరకు పరిచయమయ్యారు. ఘాజీ, ఏ మంత్రం వేసావె, శుభలేఖలు సినిమాల్లో నటించినా.. 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమాలోని లలన్ సింగ్, 2020లో వచ్చిన పలాస 1978 సినిమాలో రంగారావు పాత్రలతో నటనకు మంచి గుర్తింపు రావడంతో పాటు ప్రముఖ దర్శకుల, నిర్మాతల దృష్టిలో పడ్డారు. సిన్ వెబ్ సిరీస్, టక్ జగదీష్ సినిమాలో తన నటనను నిరూపించుకున్నారు. ఇక 2022లో వచ్చిన ‘మసూద’ సినిమాతో హీరోగా […]
టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. అనుకోకుండా ఎప్పుడైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు. మీ విశాల హృదయానికి మరోసారి ధన్యవాదాలు చిరు గారు అంటూ ఆర్జీవీ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్వీట్ చూసి సినీ అభిమానులు, నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ చిరుకి ఈరోజు ఆర్జీవీ ఎందుకు క్షమాపణలు చెప్పాడంటే… రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న భారత క్రికెట్ పేరు ‘ఆకిబ్ నబీ’. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన 29 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఆకిబ్.. 2025 రంజీ ట్రోఫీలో చెలరేగుతున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. ఆకిబ్ తన పేస్ బౌలింగ్‌తో స్టార్ బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అసాధారణ వేగంతో బంతులేస్తున్న ఆకిబ్ పేరు ఇప్పుడు నెట్టింట చర్చకు దారి తీసింది. దేశవాళీ క్రికెట్ నుంచి మరో పేస్ బౌలింగ్ సంచలనం […]