టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు ఇటీవలి కాలంలో ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో దారుణ ప్రదర్శన చేశారు. విరాట్ ఒక్క సెంచరీ మినహా.. పేలవ ప్రదర్శన చేశాడు. రోహిత్ అయితే ఆడిన మూడు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. దాంతో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లపై విమర్శల వర్షం కురుస్తోంది. రోహిత్, కోహ్లీలు రిటైర్మెంట్ ఇవ్వాలనే డిమాండ్స్ సైతం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ […]
స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు భారత్ సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ రెండు సిరీస్‌లకు బీసీసీఐ సెలెక్టర్లు జట్లను ప్రకటించనున్నారు. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే జట్టునే.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడించే అవకాశం ఉంది. అయితే న్యూజీలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మను జట్టుకు ఎంపిక చేస్తారా? లేదా? అనేది అనుమానంగా ఉంది. దీనిపై బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఫామ్ లేమి కారణంగా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు […]
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ వరుసగా 5జీ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలో వన్‌ప్లస్ 13 సిరీస్‌ను రిలీజ్ చేసింది. మంగళవారం నిర్వహించిన వింటర్ లాంచ్ ఈవెంట్లో 13 సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్లను లాంచ్ చేసింది. 50 ఎంపీ సోనీ ఎల్వైటీ 808 మెయిన్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫ్లాగ్షిప్ 5జీ స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్లకు నాలుగేళ్ల ఓఎస్ అప్డేట్లు, […]
రెండు రోజుల పాటు సాగనున్న అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం చండీగఢ్‌లో ఆరంభమైంది. ఏఎఫ్ఐ అధ్యక్షుడిగా మాజీ షాట్‌పుట్ క్రీడాకారుడు, పద్మశ్రీ బహదూర్‌సింగ్ సాగూ ఎన్నికయ్యారు. ఆదిల్ సుమరివాలా స్థానంలో బహదూర్‌సింగ్ బాధ్యతలు చేపట్టారు. పోటీలో మరెవ్వరూ లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2029 వరకు ఏఎఫ్ఐ అధ్యక్షుడిగా కొనసాగుతారు. బహదూర్‌సింగ్ 2002 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచారు. 2000, 2004 ఒలింపిక్స్‌లోనూ ఆయన పాల్గొన్నారు. Also Read: […]
ఇండియా ఓపెన్ ప్రపంచ సూపర్ 750 టోర్నీ ఢిల్లీ వేదికగా జనవరి 14 నుంచి 19 వరకు జరగనుంది. ఈ టోర్నీలో భారత స్టార్ షట్లర్, కొత్త పెళ్లి కూతురు పీవీ సింధు పాల్గొననున్నారు. వివాహం తర్వాత సింధు పాల్గొనే తొలి టోర్నీ ఇదే. గతేడాది చివర్లో ఉదయ్‌పూర్‌లో వెంకట దత్త సాయితో సింధు వివాహం జరిగిన విషయం తెలిసిందే. 2025 సీజన్‌ను త్వరగా ఆరంభించేందుకే డిసెంబర్లో తాను వివాహం చేసుకున్నానని ఒలింపిక్ విజేత చెప్పారు. టోర్నీ […]
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ ‘జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా’ తన ఎలక్ట్రిక్ కారు ‘విండ్సోర్’ ధరలను పెంచింది. విండ్సోర్ అన్ని వేరియంట్లపై రూ.50 వేలు పెంచుతున్నట్లు కంపనీ ప్రకటించింది. అంతేకాదు ఫ్రీ ఛార్జింగ్ ప్రయోజనాలను కూడా నిలిపివేసింది. విండ్సోర్ లాంచ్ సమయంలో ప్రారంభ ధరను 10వేల యూనిట్లు వరకు లేదా డిసెంబర్ 31 వరకు మాత్రమే పరిమితం అని పేర్కొంది. యాదృచ్ఛికంగా విండ్సోర్ ఈవీ విక్రయాలు డిసెంబర్లోనే 10,000 యూనిట్ల విక్రయ మైలురాయిని చేరుకుంది. దాంతో […]
చెన్నై విమానాశ్రయంలో ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ ఓ రిపోర్టర్‌పై అసహనం వ్యక్తం చేశారు. తనని రాజకీయ ప్రశ్నలు అడగవద్దని ఆగ్రహానికి గురయ్యారు. రజనీకాంత్ ప్రస్తుతం ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం థాయిలాండ్ వెళ్తున్న రజనీ.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనను ఉద్దేశిస్తూ.. ఓ రిపోర్టర్ మహిళల భద్రతపై ప్రశ్నించారు. తనని రాజకీయ ప్రశ్నలు అడగవద్దని ముందే […]
చెస్ ప్రపంచ నంబర్‌వన్, మాజీ ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన గర్ల్‌ఫ్రెండ్ ఎల్లా విక్టోరియా మలోన్ను పెళ్లాడాడు. ఓస్లోలోని మంచు కొండలలోని హోల్మెన్కొల్లెన్ చాపెల్‌లో కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య కార్ల్సన్, ఎల్లా వివాహం ఘనంగా జరిగింది. అనంతరం ఓస్లోలోని 5-స్టార్ గ్రాండ్ హోటల్లో నిర్వహించిన వివాహ విందుకు ఎంపిక చేసిన అతిథులు మాత్రమే హాజరయ్యారు. Also Read: Yuvaraj Singh: గతంలో నేనెప్పుడూ చూడలేదు.. కోహ్లీ, రోహిత్‌లు అద్భుతం: […]
ఇటీవలి కాలంలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టుల్లో విఫలమవుతున్నారు. సొంతగడ్డపై న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా నిరాశపర్చారు. దాంతో కోహ్లీ, రోహిత్‌లపై పలువురు టీమిండియా మాజీలు, అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టీమ్ నుంచి తప్పుకుని యువకులకు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ వీరికి మద్దతుగా నిలిచారు. కోహ్లీ, రోహిత్‌లపై విమర్శలు సరికావని.. గతంలో వారు ఏం సాధించారో ఫాన్స్ […]
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ‘వివో’ తన టీ-సిరీస్‌లో టీ3ఎక్స్ 5జీ ఫోన్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేసింది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.13,999కు లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ వేరియంట్‌పై రూ.1,000 తగ్గించింది. ఈ ఒక్క వేరియంట్‌పై మాత్రమే కాదు.. మిగతా రెండు వేరియంట్లపై కూడా వివో రూ.1,000 తగ్గించింది. రూ.15వేల లోపు వివో టీ3ఎక్స్ ఫోన్ టాప్ వేరియంట్‌ను కొనుగోలు చేయొచ్చు. తగ్గిన ధరల ప్రకారం.. వివో టీ3ఎక్స్ […]