కొత్త ఏడాదిలో గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. నేటి నుంచే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 ఆరంభం అవుతోంది. ఆల్‌టైమ్ గ్రేట్, సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ 25వ రికార్డు గ్రాండ్‌స్లామ్‌పై దృష్టి పెట్టాడు. ఈ గ్రాండ్‌స్లామ్ గెలిస్తే టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన ప్లేయర్‌గా జాకో చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం మార్గరెట్ కోర్ట్‌తో సమానంగా టైటిళ్లు 24 సాధించాడు. ఆ ఒక్కటీ గెలవాలన్న జాకో ఆశతో అతడు బరిలోకి దిగుతున్నాడు. చరిత్రకు టైటిల్ దూరంలో ఉన్న […]
సింగరాయకొండ అయ్యప్ప నగర్లో గోకులం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంకు మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య హాజరుకానున్నారు. నేటి నుంచి తిరుమలలో శ్రీవారి కళ్యాణోత్సవం పున:ప్రారంభం కానుంది. ప్రస్తుతం రేపటికి సంబంధించిన దర్శనం టికెట్లు తిరుపతిలో టీటీడీ జారీ చేస్తోంది. ఒంగోలులో జిల్లా యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతి కార్యక్రమాలు జరగనున్నాయి. నేటి నుంచి నాలుగు రోజుల పాటు సీఎం చంద్రబాబు […]
ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ సాంప్రదాయ ఫార్మాట్లో 10 వేల మైలురాయికి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే స్మిత్ పెవిలియన్‌కు చేరాడు. స్మిత్ కెరీర్లో కీలక మైలురాయిని అందుకుంటాడని ఆసీస్ ఫాన్స్, క్రికెటర్స్ ఆశగా చూస్తున వేళ.. భారత పేసర్ ప్రసిధ్ కృష్ణ అతడిని ఔట్ చేశాడు. దాంతో కంగారో ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా దీనిపై స్మిత్ […]
ఈ ఏడాదిలో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ కొత్త సేల్‌ను తీసుకొచ్చింది. ‘మాన్యుమెంటల్’ సేల్ 2025ను తాజాగా ప్రకటించింది. ఈ సేల్ జనవరి 13న మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది. ప్లస్, వీఐపీ మెంబర్లకు 12 గంటల ముందుగానే (జనవరి 13 అర్ధరాత్రి 12 గంటలకు) సేల్ అందుబాటులోకి వస్తుంది. సేల్‌లో భాగంగా హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు, ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఫ్లిప్‌కార్ట్ […]
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను నిర్వహించేందుకు సిద్దమైంది. జనవరి 13 నుంచి సేల్ ప్రారంభం కానుంది. సాధారణ యూజర్లకు జనవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి, ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందుగానే (జనవరి 13 అర్ధరాత్రి 12 గంటలకు) ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. సేల్ బ్యానర్ ప్రస్తుతం […]
ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ 3-1తో ఓడిపోవడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. భారత మాజీలు కూడా గంభీర్‌పై మండిపడుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఘాటుగా స్పందించాడు. గంభీర్ చేసే పనులకు.. చెప్పే మాటలకు పొంతన ఉండదన్నారు. ప్రధాన కోచ్‌గా ఉన్నపుడు భారత్‌కు చెందిన వారిని సహాయక కోచ్‌లుగా తీసుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు. 2015 రంజీ ట్రోఫీ సమయంలో తనకు, గంభీర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు […]
గతేడాది బంగారం ధరలు భగ్గుమన్నాయి. కొత్త ఏడాదిలో కూడా గోల్డ్ రేట్స్ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో మరలా పసిడి 80 వేలకు చేరువైంది. గత మూడు రోజుల్లో వరుసగా రూ.100, రూ.350, రూ.250లు పెరిగింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (జనవరి 10) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,850గా.. 24 క్యారెట్ల ధర రూ.79,470గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా ఇటీవలి రోజుల్లో పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. గత […]
భారత్ మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, ధనశ్రీ వర్మలు విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, యూజీ తన ఖాతా నుంచి ధనశ్రీ ఫొటోలను తొలగించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. చహల్, ధనశ్రీ విడిపోయేందుకు సిద్దమయ్యారని సంబంధింత వర్గాలు కూడా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బుధవారం ధనశ్రీ ఈ వార్తలపై ఓ పోస్టు చేసింది. తాజాగా చహల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. […]
శిఖర్ ధావన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులను అలరించిన గబ్బర్.. మైదానంలో తన చిలిపి చేష్టలతో నవ్వులు పూయించేవాడు. ఇక కరోనా మహమ్మారి సమయంలో మాజీ సతీమణి, కుమారుడితో రీల్స్ చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. ఇటీవల కాస్త సైలెంట్ అయిన ధావన్.. మళ్లీ మొదలెట్టాడు. తాజాగా ఓ సరదా వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. శిఖర్ ధావన్ […]
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో దారుణ ప్రదర్శన చేసిన భారత జట్టుపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆట కంటే పాపులారిటీ, పేరు ప్రఖ్యాతులు ముఖ్యం కాదన్నారు. టీమిండియా సూపర్‌స్టార్ సంస్కృతిని వీడాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో భజ్జీ మరో పోస్ట్ చేశారు. ‘మార్కెట్లో ఏనుగు నడిచి వెళ్తుంటే డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వైరల్‌గా […]