చెస్ ప్రపంచ నంబర్‌వన్, మాజీ ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన గర్ల్‌ఫ్రెండ్ ఎల్లా విక్టోరియా మలోన్‌ను పెళ్లాడాడు. ఓస్లోలోని మంచు కొండలలోని హోల్‌మెన్‌కొల్లెన్ చాపెల్‌లో కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య కార్ల్‌సన్, ఎల్లా వివాహం ఘనంగా జరిగింది. అనంతరం ఓస్లోలోని 5-స్టార్ గ్రాండ్ హోటల్‌లో నిర్వహించిన వివాహ విందుకు ఎంపిక చేసిన అతిథులు మాత్రమే హాజరయ్యారు.
Also Read: Yuvaraj Singh: గతంలో నేనెప్పుడూ చూడలేదు.. కోహ్లీ, రోహిత్‌లు అద్భుతం: యువీ
26 ఏళ్ల ఎల్లా విక్టోరియా మలోన్ తల్లి ఓ నార్వేజియన్ కాగా.. తండ్రి అమెరికన్. నార్వే రాజధాని ఓస్లోలో ఎల్లా పెరిగారు. అమెరికాలో చదువుకున్న ఆమె.. సింగపూర్‌లో ఉంటున్నారు. ఇక 34 ఏళ్ల మాగ్నస్ కార్ల్‌సన్ నార్వే దేశానికిచెందిన చెస్ ప్లేయర్ అన్న విషయం తెలిసిందే. ఎల్లా, కార్ల్‌సన్ మొదటిసారి ఫిబ్రవరి 2024లో జర్మనీలోని ఫ్రీస్టైల్ చెస్ ఛాలెంజ్‌లో జంటగా కనిపించారు. అనంతరం పలు టోర్నమెంట్‌లకు కార్ల్‌సన్‌తో కలిసి వచ్చారు. ఇటీవల జరిగిన వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల ఓపెన్ విభాగంలో కార్ల్‌సన్ రష్యాకు చెందిన ఇయాన్ నెపోమ్నియాచితో తలపడ్డారు. కార్ల్‌సన్ ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ షిప్ గెలిచారు.