ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి విజయసాయిరెడ్డి వచ్చారు. కాకినాడ పోర్టు సెజ్‌కు సంబంధించిన కేసులో ఈడీ ఎదుట ఆయన విచారణకు ఆయన హాజరయ్యారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలపై వైసీపీ ఎంపీని ఈడీ అధికారులు ఎంత సేపు విచారణ చేస్తారో చూడాలి. వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ (కేఎస్పీఎల్), కాకినాడ సెజ్ (కేసెజ్)ల్లోని రూ.3,600 కోట్ల విలువైన షేర్లను కేవీ రావు (కర్నాటి వెంకటేశ్వరరావు) […]
కాకినాడ తీరంలో గత 55 రోజులుగా నిలిచిపోయిన ‘స్టెల్లా ఎల్’ నౌకకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈరోజు తెల్లవారుజామున పశ్చిమ ఆఫ్రికాకు నౌక బయలుదేరి వెళ్లింది. కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కొటోనౌ పోర్టుకు నౌక బయల్దేరింది. కొటోనౌ పోర్టుకు బయల్దేరేందుకు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం అనుమతిని ఇచ్చారు. హల్దియా నుంచి 2024 నవంబరు 11న కాకినాడ తీరానికి స్టెల్లా షిప్ వచ్చిన విషయం […]
గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్. వరుసగా పెరిగిన బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కొత్త ఏడాదిలో వరుసగా మూడు రోజులు పెరిగిన పసిడి.. నాలుగో రోజు తగ్గింది. ఇక గత రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (జనవరి 6) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,150గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.78,710గా నమోదైంది. వెండి రేట్స్ కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. గత రెండు రోజులుగా వెండి […]
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహిస్తుంటారు. ఏ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11 రోజులపాటు జరిగే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో శ్రీనివాసరావు స్పందించారు. భక్తులు సంతృప్తికరమైన సమాధానం అనుభవాన్ని పంచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. దర్శనం విషయంలో క్యూలైన్స్‌లో ఒత్తిడి లేకుండా.. ఏ లైన్ దేనికి అనేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అటవీశాఖ […]
చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద తిరుమల శ్రీవారి భక్తులపైకి అంబులెన్స్ (108 వాహనం) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పుంగనూరు నుంచి తిరుమలకు కాలినడకన వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ (40), లక్ష్మమ్మ (45)గా గుర్తించారు. అంబులెన్స్ […]
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద తిరుమల శ్రీవారి భక్తులపైకి అంబులెన్స్ (108 వాహనం) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పుంగనూరు నుంచి తిరుమలకు కాలినడకన వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ (40), లక్ష్మమ్మ (45)గా గుర్తించారు. అంబులెన్స్ మదనపల్లె నుంచి తిరుపతికి […]
ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంపై సీఎం స్పెషల్ ఫోకస్ చేయనున్నారు. ‘స్వర్ణ కుప్పం’ పథకం పేరిట కుప్పం రూపురేఖలు మరింతగా మార్చనున్నారు. వచ్చే ఐదేళ్ల పాటు కుప్పం ప్రాంత సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’ పథకంను సీఎం ఆరంభించనున్నారు. ఆది, సోమ, మంగళవారం కుప్పంలో సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. నేడు ద్రవిడ యూనివర్శిటీలో ‘స్వర్ణ కుప్పం-విజన్ […]
చిన్నారుల ఫిట్నెస్, చదువు కోసం జూబ్లీహిల్స్‌లో ‘సీసా స్పేసెస్’ను ఏడాది క్రితం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థతో కలిసి భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా అడుగు వేయనున్నారు. కొత్త ఏడాదిలో సీసా స్పేసెస్‌తో కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు సానియా తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని సీసా స్పేసెస్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సానియా పాల్గొన్నారు. సీసా స్పేసెస్ భాగస్వాములైన మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల, స్వాతి గునుపాటి కూడా […]
నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మూడు రోజులపాటు సొంత నియోజకవర్గంపై సీఎం ఫోకస్ చేయనున్నారు. ఈరోజు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఇవాళ ఏపీకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రానున్నారు. సాయంత్రం 5:30 గంటలకు బెంగుళూరు నుంచి గన్నవరం విమానాశ్రయంకు […]
గుడివాడలోని రైలుపేటలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటి సమీపంలో ముఠా కార్మికుడిగా పనిచేస్తున్న ఎండూరి జోజి బాబు (45) చిన్నారిపై దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారిని చికిత్స నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైలుపేటలోని బాలిక ఇంటి వద్ద గుడివాడ డీఎస్పీ అబ్దుల్ సుబాన్ స్వయంగా విచారణ […]