చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ‘వివో’ తన టీ-సిరీస్‌లో టీ3ఎక్స్ 5జీ ఫోన్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేసింది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.13,999కు లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ వేరియంట్‌పై రూ.1,000 తగ్గించింది. ఈ ఒక్క వేరియంట్‌పై మాత్రమే కాదు.. మిగతా రెండు వేరియంట్‌లపై కూడా వివో రూ.1,000 తగ్గించింది. రూ.15వేల లోపు వివో టీ3ఎక్స్ ఫోన్ టాప్ వేరియంట్‌ను కొనుగోలు చేయొచ్చు.
తగ్గిన ధరల ప్రకారం.. వివో టీ3ఎక్స్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.13,999గా.. 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.15,499గా ఉంది. ఫ్లిప్‌కార్ట్, వివో వెబ్‌సైట్‌తో సహా ఇతర ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లలో తక్కువ ధరకే వివో టీ3ఎక్స్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంకు ఆఫర్ కూడా ఉంది. అన్ని బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1000 తగ్గింపు అందుబాటులో ఉంది. దాంతో మరింత తక్కువ ధరకు వివో టీ3ఎక్స్‌ను సొంతం చేసుకోవచ్చు.
Also Read: Shubman Gill: శుభ్‌మన్ గిల్ ఓవర్ రేటెడ్ క్రికెటర్: శ్రీకాంత్
వివో టీ3ఎక్స్‌లో 6.72 అంగుళాల ఫ్లాట్ ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేటు ఈ స్క్రీన్ సొంతం. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్‌ఓఎస్ 14 ఔటాఫ్ బాక్స్ ఓఎస్, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌తో ఇది వచ్చింది. వెనకభాగంలో 50 ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ డెప్త్‌తో కూడిన కెమెరా సెటప్ ఉంటుంది. 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. బ్లూటూత్ 5.1, డ్యూయల్ బ్యాండ్ వైఫై, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లూ ఉన్నాయి.