Tragedy : కురువపల్లి గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు వరుణ్ తేజ మృతితో సంబంధించి జడ్చర్లకు చెందిన న్యాయవాది, సామాజికవేత్త పెద్దింటి రవీంద్రనాథ్ జాతీయ బాలల హక్కుల సంఘం (NCPCR), భారత మానవ హక్కుల సంఘం (NHRC)లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం.. వరుణ్ తేజ ఆరోగ్యం బాగలేదని గుర్తించిన కుటుంబం, లింగంపేటలోని RMP డాక్టర్ శ్రీకాంత్ వద్దకు తీసుకువెళ్ళారు. అయితే సరైన వైద్యం అందించకపోవడం, డాక్టర్ నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందాడు. న్యాయవాది పెద్దింటి […]
నిషేధిత సీ.పి.ఐ మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి, సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యుడు, దండాకారుణ్య స్పెషల్ జోన్ కమిటీకి చెందిన మంద రూబెన్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఎదుట లొంగిపోవడం సంచలనంగా మారింది.
స్థానిక ఎన్నికల వేళ ఆ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైపోయారా? పార్టీ పెద్దలు కూడా... కమ్ కమ్ వెల్కమ్ అంటున్నా లోకల్ ఈక్వేషన్స్ మాత్రం రివర్స్ అవుతున్నాయా? సీఎంతో ఉన్న సాన్నిహిత్యం ఫైనల్‌గా ఆ లీడర్‌కి కలిసొస్తుందా? లేక అడ్డంకి అవుతుందా? ఎవరా మాజీ శాసనసభ్యుడు? ఏంటా జంపింగ్ జపాంగ్ కహానీ? మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజక వర్గం నుంచి టీడీపీ తరపున మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు ఎర్రశేఖర్.
తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎనిమిదేళ్లుగా సాగుతున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టు ఆలస్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీఎంఓ అధికారిగా నటించి మోసాలకు పాల్పడ్డ వ్యక్తిపై కేసు.. హైదరాబాద్ లో పీఎంఓ అధికారిగా నటించి మోసాలకు పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు అయింది. ప్రధాన మంత్రి కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. PMOలో సీనియర్ అధికారిగా నటిస్తూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. టీటీడీలో సుప్రభాత దర్శనం కోసం రామారావు సిఫార్సు లేఖ రాశాడు. కర్ణాటకలోని రెవెన్యూ అధికారులకు లేఖ రాసి భూముల రికార్డులు […]
భారతదేశంలో ప్రముఖ ఆరోగ్య సేవల సంస్థగా పేరుగాంచిన కేర్ హాస్పిటల్స్, తమ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా డాక్టర్ పవన్ కుమార్‌ను నియమించినట్లు ప్రకటించింది.
Smuggling : నాంపల్లి ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అధికారులు మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో అధికారులు 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. STF ఏ-టీమ్ లీడర్ అంజిరెడ్డి అందించిన సమాచారం మేరకు సిబ్బంది సమన్వయంతో ఈ దాడులు జరిగాయి. తనిఖీల్లో గంజాయితో పాటు ఒక టు-వీలర్, సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో హట్ గోడకు […]
బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సామాజిక న్యాయం దిశగా చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్న ఈ వ్యవహారంలో ఏ మాత్రం నిర్లక్ష్యం జరగకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు.
Kaleshwaram Commission : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని చర్యలు తీసుకోవద్దని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టకూడదని కేసీఆర్, హరీశ్ […]