ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పల్నాడు జిల్లా పరిధిలోని చిలకలూరిపేట మెగా పేరెంట్స్ మీటింగ్‌లో ఓ మాట ఇచ్చారు పవన్ కల్యాణ్.. ఇచ్చిన మాట ప్రకారం.. శారదా హైస్కూల్ లైబ్రరీకి పుస్తకాలు, 25 కంప్యూటర్లు, ల్యాబ్ పరికరాలు అందించారు. ఎమ్మెల్యే పుల్లారావు, కలెక్టర్ కృతిక శుక్లా కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీని ప్రారంభించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఈ నెల 5న చిలకలూరిపేట ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సమావేశాలు నిర్వహించాలన్న మంత్రి లోకేష్ ఆలోచన అద్భుతమని డిప్యూటీ సీఎం తెలిపారు. మైలవరపు కృష్ణ తేజ తాతగారు గుండయ్య పేరుతో కూడలి ఉండటం ఆయన సేవా నిరతిని గుర్తు చేసిందన్నారు. అప్పట్లో పెద్దలు పాఠశాలలకు స్థలాలు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు కొందరు స్థలాలు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పలు కీలక విషయాల గురించి మాట్లాడారు. పిఠాపురంలో విద్యార్థుల మధ్య చిన్న గొడవను కులాలకు అంటగట్టారని మండిపడ్డారు. కేరళలో తల్లిదండ్రుల సంఘాలు చాలా బలంగా ఉంటాయని, క్రియాశీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి సమావేశాల కారణంగా పిల్లల బలాబలాలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చిన హామీని తాజాగా డిప్యూటీ సీఎం నెరవేర్చారు.
ఆధ్యాత్మికత ద్వారానే విశ్వ చైతన్యం సాధ్యం..
ఆధ్యాత్మికత ద్వారానే విశ్వ చైతన్యం సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం హైదరాబాద్ శివారులోని కన్హా శాంతి వన ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కన్హా శాంతి వనం నిర్వాహకులు, శ్రీరామ చంద్ర మిషన్ ప్రెసిడెంట్ దాజీతో సమావేశమయ్యారు. శాంతి వనంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ఉంది. అలాగే వెల్‌నెస్ సెంటర్, యోగా చేసుకునేందుకు సౌకర్యం, హార్ట్‌ఫుల్‌నెస్ ఇంటర్నేషనల్ స్కూల్, పుల్లెల గోపీచంద్ స్టేడియం వంటివి ఉన్నాయి. వీటిని దాజీతో కలిసి సీఎం చంద్రబాబు సందర్శించారు. అలాగే శాంతివనంలో జరుగుతోన్న శాస్త్రీయ, వృక్షశాస్త్ర పరిశోధనల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. శాంతి వనంలో చేపడుతున్న జీవ వైవిధ్యం, పర్యావరణ కార్యక్రమాలను వీక్షిస్తూ సీఎం చంద్రబాబు రెయిన్‌ఫారెస్ట్‌ను సందర్శించారు.
ముగిసిన మూడో విడత ప్రచార పర్వం
రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం పర్వం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈ విడత పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 17న (బుధవారం) 182 మండలాలు, 4157 గ్రామ పంచాయతీలలో పోలింగ్ జరగనుంది. తుది విడతలో 53 లక్షల 6 వేల 401 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 26 లక్షల 1861 మంది పురుష ఓటర్లు, 27 లక్షల 4 వేల 394 మంది మహిళా ఓటర్లు, 146 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఈ పోలింగ్ ప్రక్రియ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 వేల 483 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే.. మూడో విడతలో మొత్తం 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోడీ.. ఘనస్వాగతం పలికిన పీఎం జాఫర్ హసన్
అరబ్ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోర్డాన్‌కు చేరుకున్నారు. జోర్డాన్‌లోని అమ్మాన్‌లో అడుగుపెట్టిన ప్రధాని మోడీకి జోర్డాన్ ప్రధానమంత్రి జాఫర్ హసన్ ఘన స్వాగతం పలికారు. జోర్డాన్ రాజు II అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా ఇబ్న్ అల్ హుస్సేన్, ప్రధాని జాఫర్‌తో సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. ” నేను అమ్మాన్ చేరుకున్నాను. విమానాశ్రయంలో నాకు లభించిన ఆత్మీయ స్వాగతం కోసం జోర్డాన్ హాషెమైట్ రాజ్యం ప్రధాన మంత్రి జాఫర్ హసన్ కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ పర్యటన మన దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంచుతుందని నేను విశ్వసిస్తున్నాను ” అని రాసుకొచ్చారు. ముఖ్యంగా ప్రధాని మోడీ పర్యటన భారత్- జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి కావడానికి గుర్తుగా నిలుస్తుంది. జోర్డాన్ అనేది ప్రధాని మోడీ నాలుగు రోజుల, మూడు దేశాల పర్యటనలో మొదటి దశ. ఆ తర్వాత ఇథియోపియా, ఒమన్‌ల్ లలో పర్యటించనున్నారు.
పేదల పొట్ట కొట్టడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కుట్రకు తెరలేపిందని రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్రంగా విమర్శించారు. పేదల జీవనాధారంగా ఉన్న ఈ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పేరుతో పాటు దాని ఆత్మను కూడా మార్చే ప్రయత్నం జరుగుతోందని సీతక్క తెలిపారు. పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం అత్యంత దుర్మార్గమైన చర్యగా ఆమె అభివర్ణించారు. ఉపాధి హామీ పథకం పట్ల కేంద్రానికి మొదటి నుంచే విముఖత ఉన్నదని, 100 రోజుల ఉపాధి కల్పించాల్సిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని అన్నారు.
ఐపీఎల్ వేలంలో 39 ఏళ్ల స్పిన్నర్.. గతంలో పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 కోసం ఆటగాళ్ల మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. వేలం జాబితాలో మొత్తం 350 మంది ఆటగాళ్లు ఉన్నారు. అయితే గరిష్టంగా 77 మంది ఆటగాళ్లని 10 ప్రాంఛైజీలు కొనుగోలుకు చేయనున్నాయి. 77 మందిలో 31 మంది విదేశీ ఆటగాళ్లకు స్లాట్ ఉంది. షార్ట్‌లిస్ట్ చేయబడిన 350 మంది ఆటగాళ్లలో 240 మంది భారతీయులు, 110 మంది విదేశీయులు ఉన్నారు. మినీ వేలం మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఐపీఎల్ చరిత్రలో ఇది 19వ వేలం. ఐపీఎల్ వేలాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. JioHotstar యాప్, వెబ్‌సైట్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది.
విష్ణు విన్యాసం చేయనున్న శ్రీవిష్ణు
శ్రీ విష్ణు కొత్త చిత్రం టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ (ఎస్‌ఎస్‌సి) బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘విష్ణు విన్యాసం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చిత్ర బృందం విడుదల చేసిన స్టైలిష్ యానిమేటెడ్ గ్లింప్స్ ద్వారా ఈ టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ వీడియో సినిమా నేపథ్యాన్ని ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఉత్సుకత పెంచింది. అర్బన్ సెటప్‌లో సాగిన ఈ యానిమేటెడ్ ఫుటేజ్‌లో, కస్టమ్ పసుపు రంగు మోటార్‌సైకిల్‌పై నగర వీధుల్లో దూసుకుపోతున్న శ్రీ విష్ణు ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ఆకట్టుకున్నాడు.
పెళ్లిళ్లకు లోన్లు ఇస్తున్న ఫిన్టెక్ కంపెనీలు
పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేకపోయినా, ఎలాంటి టెన్షన్ లేకుండా గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవచ్చని, ఖర్చు తాము చూసుకుంటామని ప్రస్తుత ఫిన్‌టెక్ కంపెనీలు సరికొత్త ఆఫర్‌తో ముందుకు వస్తున్నాయి. ఈ కంపెనీలు ‘మ్యారీ నౌ పే లేటర్’ అనే ఆఫర్‌తో వెడ్డింగ్ లోన్లను అందిస్తున్నాయి. ఒకప్పుడు సాదాసీదాగా జరిగే పెళ్లిళ్లు ఇప్పుడు ధూమ్‌ధామ్‌గా, బ్యాండ్ బాజా, వెడ్డింగ్ షూట్‌లతో అద్దిరిపోయేలా జరుపుకుంటున్నారు. ఈ ఖర్చు ఎంతైనా సరే రాజీ పడకూడదనుకునేవారు డబ్బు లేకపోయినా అప్పు తెచ్చి మరీ పెళ్లిని ఘనంగా చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలు సైతం పెళ్లికి సగటున 25 లక్షల రూపాయల వరకు వెచ్చిస్తున్నారు.
కమీషన్ల కోసమే పీపీపీ అనే దుర్మార్గమైన మోడల్.. మాజీ మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు..
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైసీపీ ప్రజా ఉద్యమం తీరును అందరూ చూస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.. గత 18 నెలల కాలంగా వైసీపీ అనేక ప్రజా ఉద్యమాలు చేస్తుందని తెలిపారు.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, రైతాంగ సమస్యలపై నిరంతర పోరాటం చేస్తుందన్నారు.. తాజాగా వైసీపీ ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో అంబటి మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కమీషన్ల కోసం పీపీపీ అనే దుర్మార్గమైన మోడల్ తెచ్చి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు.. రాష్ట్రంలో కోటి సంతకాలను సేకరించాలని ప్రతీ ఒక్కరి దగ్గరకు వెళ్ళిందని విమర్శించారు.. నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు.. అక్కడ నుంచి కేంద్ర కార్యాలయం వరకు ప్రజల సంతకాలు వచ్చాయన్నారు.. ప్రతి జిల్లాలో వైసీపీ నిరసనలకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారన్నారు.. రాష్ట్రంలో అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ ఉండకూడదని భర్తీ చేశారని తెలిపారు.. ఇవాళ జీరో వెకెన్సీ సిస్టమ్ లేదు.. మందులు లేవు.. ప్రజారోగ్యం, విద్య కోసం 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు..