Checkposts Close: తెలంగాణలోని అన్ని రవాణా శాఖ చెక్‌పోస్టులను తక్షణమే మూసివేయాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సాయంత్రం 5 గంటలలోపు చెక్‌పోస్టుల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రవాణా శాఖ పరిధిలో ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దుల వద్ద, ప్రధాన మార్గాల్లో పనిచేస్తున్న చెక్‌పోస్టులన్నీ తక్షణమే మూసివేయాలని కమిషనర్ సూచించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని వెంటనే పునర్వినియోగం చేయాలని, వారికి తగిన విధులు కేటాయించాలని ఆదేశించారు. […]
Students Missing Case : నర్సాపూర్ మైనార్టీ గురుకులంలో నిన్న అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో తండ్రి వద్ద ఉన్నారని తెలిసిన నేపథ్యంలో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వరాల్లోకి వెళ్తే.. నర్సాపూర్ మైనార్టీ గురుకులంలో చదువుతున్న అన్నదమ్ములు అమీర్ (12), అలీ (11) నిన్న మధ్యాహ్నం ఆటల సమయంలో స్కూల్ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోయారు. వారి గురించి వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గురుకుల ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. […]
CM Revanth Reddy : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై తన నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. నూతన ఆసుపత్రి అవసరాలకు తగినట్లు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్లు గదులు, ల్యాబ్‌లు, […]
వైసీపీలో నిశ్శబ్దం పూర్తి స్థాయిలో బద్దలైపోయినట్టేనా? ఇన్నాళ్ళు అనుమానాలతో చూద్దాం, చేద్దాం అనుకున్న సీనియర్స్ కూడా ఇక యాక్టివ్ బటన్ ఆన్ చేసినట్టేనా? ఇప్పుడే ఎందుకు గేర్ మారుస్తున్నారు అంతా? ఇప్పటికీ గడప దాటకుంటే మీ కుర్చీల కిందికి నీళ్ళొస్తాయన్న వార్నింగ్స్ బలంగా పని చేశాయా? ఫ్యాన్ పార్టీలో అసలేం జరుగుతోంది? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు కావస్తోంది. వైసీపీ కనీవినీ ఎరుగని ఘోర ఫలితాలను చూడటం, అధికార మార్పిడి జరిగాక మాజీ […]
పాతబస్తీలో భాగ్యలక్ష్మీ ఆలయం ఎక్కడుంది? అంటూ హేళన చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఈరోజు కళ్లు తెరిచి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి శక్తిని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం రావడం తన అద్రుష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్నాకే ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమైందని, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిచిందన్నారు. పార్లమెంట్ లో 8 స్థానాలు గెలుచుకోవడమే కాకుండా విజయ పరంపరను […]
దీపావళి పూట టపాకాయలు పేలడం కామన్. కానీ… ఆ సీనియర్ లీడర్ మాత్రం తన అనుభవాన్నంతా రంగరించి… పేద్ద…టపాసులో మందుగుండును కూరి మరీ… రీ సౌండ్ వచ్చేలా పేల్చారట. కానీ… వెరైటీగా ఆ సౌండ్ ఒక్కో చోట ఒక్కోలా వినిపిస్తోంది. ఇన్నాళ్ళు….. ఈ అలక ఏదైతే ఉందో… అంటూ అలిగీ అలిగీ… ఆయనకే బోర్ కొట్టిందా? లేక రొటీన్‌కు భిన్నంగా కొత్త ప్లాన్ చేస్తున్నారా? ఎవరా సీనియర్? ఏంటి ఆయన తాజా రీ సౌండ్? జగిత్యాల కాంగ్రెస్ […]
లక్ష్మీ నాయుడు కుటుంబానికి పరిహారం ప్రకటించిన సీఎం! నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామం ఘటనలో చనిపోయిన తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. లక్ష్మీ నాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు పరిహారం ప్రకటించింది. లక్ష్మీ నాయుడు పిల్లలను చదివించే బాద్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కారు దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌లకు కూడా పరిహారం ఇవ్వనున్నారు. శాంతిభద్రతలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష […]
ఆ టీడీపీ ఎమ్మెల్యే అన్నిటికీ తెగించేశారా? అల్రెడీ డమ్మీని చేసి కూర్చోబెట్టారు…. ఇప్పుడు మాట్లాడితే ఇంత మించి పోయేదేముందని భావించే నోటికి పని చెబుతున్నారా? డైరెక్ట్‌గా సొంత పార్టీ ఎంపీనే టార్గెట్ చేయడానికి కారణాలేంటి? ఎవరా ఇద్దరు నేతలు? వాళ్ళిద్దరి మధ్య గిల్లికజ్జాలు ఎంత దూరం వెళ్తున్నాయి? కొలికపూడి శ్రీనివాసరావు… ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టిడిపి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారాయన. కానీ… గెలిచినప్పటి నుంచి అధిష్టానానికి కంట్లో నలుసులా మారారరన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే ఉంది. శ్రీనివాసరావు […]
బస్తీ దవాఖానను మంగళవారం సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో దానం నాగేందర్ పేరును చేర్చిన అంశాన్ని తీవ్రంగా విమర్శించారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. “దానం నాగేందర్ బీఆర్ఎస్లో ఉన్నారని ఎవరు చెప్పారు? ఏ పార్టీకి చెందుతారో చెప్పే ధైర్యం లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గు లేదు. స్పీకర్ వద్ద అబద్దాలు చెబుతూ, పార్టీ మారలేదని ప్రజలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా […]
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ మీద వత్తిడి పెంచుతోందా? సిట్టింగ్ సీటు కాబట్టి ఎంతో కొంత సహజమే అయినా… ప్రస్తుతం అంతకు మించి అన్నట్టుగా వాతావరణం ఉందా? ఎందుకు కారు పార్టీ అంత ప్రెజర్లో ఉంది? తిరిగి పాగా వేసేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తోంది? ఈ ఒక్క సీటును మళ్లీ గెల్చుకుంటే బీఆర్ఎస్కు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? లేదంటే జరిగే నష్టమేంటటి? తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలకు జూబ్లీహిల్స్ ఫీవర్ పట్టుకుంది. ఇక్కడ ఉప ఎన్నికల్లో […]