పల్లెపోరు హస్తం పార్టీలో అగ్గి రాజేసిందా…? మరో మారు వర్గ పోరును బట్టబయలు చేసిందా? పాత, కొత్తగా విడిపోతున్న నేతలు పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తున్నారా? లోపం ఎక్కడుందో… సమస్య ఎవరి వల్ల వస్తోందో తెలిసినా… నోరెత్తలేని పరిస్థితులు పార్టీలో ఉన్నాయా? ఏయే నియోజకవర్గాల్లో అలా ఉంది? సమస్య ఎక్కడుంది? తెలంగాణ పల్లెల్లో పంచాయతీ పోరు రసవత్తరంగా మారుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాఖలైన, అవుతున్న నామినేషన్లను పరిశీలిస్తే… దాదాపు అన్నిచోట్ల పోటీ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ […]
Perni Nani : కూటమి ప్రభుత్వంపై మరోసారి వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తప్పుడు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు గతంలో ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు. మనుషులను ప్రలోభాలకు గురి చేయడంలో చంద్రబాబుకు సరితూగే వ్యక్తి లేరని విమర్శించారు. కొనుగోలుదారులను సిద్ధం చేసి, బయానాలు […]
Pemmasani Chandrasekhar : కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల నుంచి రక్షణ పొందేందుకు ‘సంచార్ సాథీ’ యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలని ఆయన సూచించారు. టెలికాం మంత్రిత్వ శాఖ, డిజిటల్ ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి ఈ యాప్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని తెలిపారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాది నుంచి దేశవ్యాప్తంగా 50 లక్షల మంది సైబర్ ఫ్రాడ్లకు […]
మరోసారి వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన యువ సంచలనం! భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2025లో బీహార్ తరపున ఆడుతున్న వైభవ్.. ఈరోజు ఈడెన్ గార్డెన్స్‌లో మహారాష్ట్రపై సెంచరీ చేశాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. అర్షిన్ కులకర్ణి వేసిన 20వ ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టడం ద్వారా వైభవ్ తన […]
Nadendla Manohar : ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి 11.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటి వరకు రూ. 2,830 కోట్లు జమ చేసినట్లు ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు.. విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. […]
Bhatti Vikramarka : ప్రజా భవన్లో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ వార్ రూమ్’ ను మంగళవారం డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సందర్శించారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి రోడ్‌మ్యాప్ రూపుదిద్దుకునే ఈ కీలక కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పన పురోగతితో పాటు ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై భట్టి విక్రమార్క వివరంగా […]
అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, వ్యయం తగ్గింపు, పీఎం కుసుమ్, సోలార్ రూఫ్‌టాప్ వంటి పథకాల పురోగతిపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ట్రాన్స్మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు […]
ఆంధ్రప్రదేశ్‌లో నీటి పారుదల రంగంలో ప్రభుత్వ మార్పు తర్వాత వేగవంతమైన పనులు ప్రారంభమయ్యాయని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అధికారంలోకి వచ్చి కేవలం ఆరు నెలలు పూర్తవుతుండగానే సాగునీటి ఎన్నికలు నిర్వహించడం తమ ప్రభుత్వ దృఢ నిశ్చయానికి నిదర్శనమన్నారు. మంత్రి రామానాయుడు విమర్శిస్తూ, గత జగన్ ప్రభుత్వం సమయంలో పులిచింతల, పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు వరదల్లో కొట్టుకుపోయినా సరైన చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన మొదటి 17 నెలల్లోనే ప్రాజెక్టుల […]
GHMC : జీహెచ్ఎంసీ విస్తరణకు కీలకమైన ‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్’పై గవర్నర్ ఆమోదం తెలిపారు. ఫైల్ ప్రభుత్వానికి చేరడంతో, తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గెజిట్ విడుదల చేయనుంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించే తీర్మానం చేసింది. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాకు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల, బయట ఉన్న 27 పురపాలక సంస్థలను జీహెచ్ఎంసీ […]
Chemical Attack : హనుమకొండలో ఘోరం చోటుచేసుకుంది. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న ఓ యువతి పై గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ దాడికి పాల్పడటం ప్రాంతంలో కలకలం రేపింది. జనగాం జిల్లా జఫరఘడ్ మండలానికి చెందిన ఆ విద్యార్థిని హనుమకొండలోని ఓ నర్సింగ్ కాలేజీలో చదువుతోంది. శుక్రవారం ఉదయం, కాజీపేట కడిపికొండ బ్రిడ్జ్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో, బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు అపై అకస్మాత్తుగా కెమికల్ చల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దాడి జరిగిన […]