Moosarambagh Bridge : మూసారాంబాగ్ ప్రాంతంలో పాత బ్రిడ్జిని కూల్చివేయడానికి జీహెచ్ఎంసి అధికారులు చర్యలు చేపట్టారు. అయితే, కొత్త హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం ఇంకా పూర్తికాకముందే పాత బ్రిడ్జిని కూల్చివేయడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. గతంలో వచ్చిన వరదలలో దెబ్బతిన్న ఈ బ్రిడ్జి, ఇంజనీరింగ్ విభాగం ప్రకారం వాహనాల రాకపోకలకు సురక్షితం కాదని తెలుసుకున్నప్పటికీ, స్థానికుల అభ్యర్థనలను పక్కన పెట్టి ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. స్థానికులు చెప్పుతున్నదాని ప్రకారం.. అంబర్పేట్ నుంచి […]
ఆ మాజీ మంత్రి రివర్స్ అటాక్ మొదలు పెట్టారా? ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్నే డిఫెన్స్‌లోకి నెట్టాలనుకుంటున్నారా? అందుకే వాయిస్ రెయిజ్ చేస్తున్నారా? ఆ విషయంలో గవర్నమెంట్ పెద్దలు ఏమనుకుంటున్నారు? ఇంకీ ఎవరా మాజీ మంత్రి? ఏ విషయంలో రివర్స్ అవుతున్నారు? ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఇప్పుడు హాట్ సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే….అది నకిలీ మద్యమే. దాన్ని బేస్ చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ, అసలు అందులో ఉన్నది కూడా మీ వాళ్ళేనంటూ… విపక్షం నోరు మూయించాలని […]
మందు తాగుదామని చెప్పి మత్తులోకి చేరుకున్నాక స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. ఎర్రకుంటకు చెందిన అబ్దుల్ ఫతేలి ఆటోడ్రైవర్ (32) వృత్తి రిత్యా ఆటోడ్రైవర్. పాతబస్తీకి చెందిన ఆటోడ్రైవర్ జహంగీర్ లు స్నేహితులు. వీరిద్దరు తరచు మద్యం సేవిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే అబ్దుల్ ఫతేలికి మద్యం తాగుతామని చెప్పి జహంగీర్ మద్యంతో పాటు ఒక బాటిల్లో పెట్రోల్ తీసుకుని బాలాపూర్ బారామల్గి వెనుక వైపుకు వచ్చాడు. […]
Vivek vs Harish Rao : సిద్ధిపేటలో జరిగే కళ్యాణాలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈసారి రాజకీయ వాతావరణంతో మారింది. కార్యక్రమంలో మంత్రి వివేక్ , మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నెలకొంది. మంత్రి వివేక్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పదేళ్లలో ఒక్క రేషన్ కార్డును కూడా ఇవ్వలేదని విమర్శించారు. దానికి ప్రతిస్పందనగా, హరీష్ రావు స్పందిస్తూ.. “మా పాలనలో 6.50 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం. కాదని నిరూపిస్తే, ఇక్కడే రాజీనామా […]
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం భారీ స్థాయిలో నామినేషన్స్ దాఖలవడం దేనికి సంకేతం? అది ప్రభుత్వం మీద వ్యతిరేకతా? లేక తెర వెనక అదృశ్య శక్తులు ఉన్నాయా? నామినేషన్స్ వేసిన వందల మంది చివరిదాకా ఎన్నికల బరిలో ఉంటారా? ఒకవేళ ఉంటే లాభం ఎవరికి? నష్టం ఎవరికి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. నామినేషన్స్ దాఖలుకు చివరి రోజైతే…ఒక చిత్రమైన సీన్ కనిపించింది. నామినేషన్ వేసేందుకు వెల్లువలా తరలి వచ్చారు అభ్యర్థులు. […]
భీమవరం డీఎస్పీ వ్యవహారశైలిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యారు? ఒక డివిజన్ అధికారి గురించి డిప్యూటీ సీఎం స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది కేవలం ఒక ఆఫీసర్‌కి సంబంధించిన వ్యవహారమేనా? లేక అంతకు మించి కూటమి పార్టీల మధ్య కుమ్ములాటల పర్యవసానమా? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కూటమి మూడు పార్టీల నేతల మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతున్నట్టుగా […]
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు ఘనంగా ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం శూన్యం అని ఆయన అన్నారు. “గాలి మాటలతో ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు?” అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం నియమించిన స్కావెంజర్లకు 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుమాలిన చర్య అని హరీష్ రావు పేర్కొన్నారు. చిన్న ఉద్యోగుల […]
త్వరలోనే రాజయ్యపేటకు జగన్.. ప్రభుత్వంపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు.. అనకాపల్లి జిల్లాలోని రాజయ్య పేట మత్స్యకారుల సమస్యలను వైసీపీ నేతలు విన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ను రద్దు చేయించాలని బొత్స సత్యనారాయణ ముందు మత్స్యకార మహిళలు కంట తడిపెడుతున్నారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమల వల్ల ప్రశాంతత కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వంతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని మత్య్సకారులు కోరారు. ఇక, శాసన మండలిలో విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ […]
Ponnam Prabhakar : ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చెక్ పోస్టులను రద్దు చేస్తూ జీవో జారీ చేసినట్లు ప్రకటించారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అన్ని లావాదేవీలు పారదర్శకంగా ఆన్లైన్లో జరగాలనే ఉద్దేశంతో రెండు నెలల క్రితం నిర్ణయం తీసుకుని, ఈరోజు నుండి చెక్ పోస్టులు పూర్తిగా మూసివేస్తూ అమలు చేస్తున్నామని తెలిపారు. రవాణా వ్యవస్థలో ఆధునికత, పారదర్శకతను తీసుకురావడమే […]
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయ చర్చలు వేడెక్కాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం తెలంగాణ జన సమితి (టీజేఎస్) కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రామ్‌ను కలిశారు.