Bandi Sanjay : బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది
- కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని కబోధులు కాంగ్రెస్ నేతలు
- 6 గ్యారంటీలపై డైవర్ట్ చేయడానికే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు
- బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : హైదరాబాద్ లోని మెర్క్యురీ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈసారి కేంద్ర బడ్జెట్ లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు కేటాయించామన్నారు.
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దమని, కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని కబోధులు కాంగ్రెస్ నేతలు అని ఆయన విమర్శించారు. 6 గ్యారంటీలపై డైవర్ట్ చేయడానికే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందన్నారు బండి సంజయ్. తెలంగాణలోని గ్రామాలు, పట్టణాల వారీగా కేంద్రం ఏం చేసిందో, రాష్ట్రం ఏం చేసిందో చర్చించడానికి సిద్ధమా? అని అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో? ఎవరు అన్యాయం చేశారో బహిరంగ చర్చకు మేం సిద్దమని, ప్రధాని హోదాకు గౌరవం ఇవ్వకుండా అవాకులు పేలడం సరికాదన్నారు. ట్యాక్స్ డివల్యూషన్ రూపంలో 29 వేల 899 కోట్ల రూపాయలు కేటాయించినమన్నారు బండి సంజయ్.
అంతేకాకుండా..’గత ఏడాదితో పోలిస్తే 10 శాతం నిధులు పెంచినం. గ్రాంట్ల రూపంలో 21 వేల 75 కోట్లు కేటాయించినం. రైల్వేల అభివృద్ధికి 5 వేల 336 కోట్లు కేటాయించినం. యూపీఏ హయాంతో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అభివృద్ధి కోసం ఈ ఏడాది బడ్జెట్ లో తెలంగాణకు 2 వేల 500 కోట్ల మేరకు రుణాలివ్వబోతున్నం. తెలంగాణలో రోడ్లు, రైళ్లు, విమానయాన రంగాల అభివ్రుద్ది కోసం 28 వేల 302 కోట్లు కేటాయించినం. ఇందులో జాతీయ రహదారుల విస్తరణ కోసం 15 వేల,640 కోట్లు కేటాయించినం. తెలంగాణలోని విద్యుత్, ఇంధన, నీటిపారుదల రంగాల అభివ్రుద్ది కోసం 10 వేల 285 కోట్లు కేటాయించినం. తెలంగాణలోని గ్రామాల, పట్టణాల అభివ్రుద్ది కోసం ఈ ఏడాది మొత్తం 6 వేల 320 కోట్లు ఖర్చు చేయబోతున్నం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో భాగంగా ఇండ్ల నిర్మాణం కోసం 2 వేల 120 కోట్లు కేటాయించినం. తెలంగాణలో వ్యవసాయం, సహకార, పశుసంవర్థక శాఖల ద్వారా రైతులకు మేలు చేసేందుకు 5 వేల 920 కోట్లు ఖర్చు చేయబోతున్నం. తెలంగాణలోని ఆరోగ్యం, పారిశుధ్య రంగాల కోసం ఈ ఏడాది మొత్తం 5వేల 790 కోట్లు కేటాయించినం. విద్యా, క్రీడా రంగాల అభివ్రుద్ధి కోసం ఈ ఏడాది 4 వేల 930 కోట్లు ఖర్చు చేయబోతున్నం. MSME పథకాలు, రుణ సబ్సిడీల కోసం 2 వేల 150 కోట్లు కేటాయించినం. అట్లాగే స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ కోసం 880 కోట్లు కేటాయించినం. రాష్ట్రంలోని మహిళా, శిశు సంక్షేమ రంగాల అభివ్రుద్ది కోసం 3 వేల 560 కోట్లు ఖర్చు చేయబోతున్నం. హోం, జాతీయ విపత్తు నిర్వహణ, రక్షణ కార్యక్రమాల అమలుకు 3 వేల 290 కోట్లు కేటాయించినం. కేంద్ర సంక్షేమ పథకాలకు సంబంధించి నేరుగా (DBT) లబ్దిదారుల ఖాతాలో నగదు జమ చేసేందుకు 5 వేల 420 కోట్లు కేటాయించినం. అట్లాగే తెలంగాణలోని పర్యాటక, సాంస్క్రుతిక రంగాల అభివ్రుద్ది కోసం 1210 కోట్లు.. అటవీ, పర్యావరణ శాఖలకు 980 కోట్లు ఖర్చు చేయబోతున్నం. బడ్జెట్ లో ఉద్యోగులకు 12 లక్షల 75 వేల వరకు ట్యాక్స్ కట్టే పనిలేకుండా మినహాయింపు ఇచ్చినం. ఒక్కో రైతుకు 5 లక్షల రూపాయల వరకు క్రెడిట్ కార్డులు ఇవ్వబోతున్నం. తెలంగాణసహా దేశంలోని యువతకు ఉపాధిని పెంచేందుకు MSME క్రెడిట్ బూస్ట్ కింద 1 లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నం. చిన్న వ్యాపారులకు 5 లక్షల రూపాయల వరకు కస్టమ్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినం. స్టార్టప్ లను ప్రోత్సహించడానికి ఈసారి ఏకంగా 10 వేల కోట్ల రూపాయలతో ఫండ్ ను ఏర్పాటు చేస్తున్నం.. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద కోటి మంది గిగ్ కార్మికులకు ఆరోగ్య సంరక్షణ కవరేజ్ అందించబోతున్నం.
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
Hyderabad Rain : హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షం..
తొలిసారిగా వ్యాపారాన్ని, పరిశ్రమలను ప్రారంభించబోయే 5 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల చొప్పున టర్మ్ రుణాలందించబోతున్నం. దేశానికి సంబందించిన బడ్జెట్ లో ఒక రాష్ట్రం పేరు లేనంత మాత్రాన ఆ రాష్ట్రానికి నిధులివ్వలేదని సరికాదు.. క్రిష్ణా జలాలు వాటాలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే.. ఏపీతో కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్.. ఎస్సెల్బీసీ ప్రాజెక్టు కట్టకుండా జాప్యం చేసింది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే.. ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి.. క్రిష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వేలెత్తి చూపింది మేమే.. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ అభ్యర్థులే కరువయ్యారు…ఇగ ఆ పార్టీ యాడుంది? బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ చీకటి మిత్రులు… కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా ఈ రేస్ కేసులేమైనయ్…? ఢిల్లీకి పోయి కాంప్రమైజ్ అయిన మాట నిజం కాదా? మాపై కేసులు పెట్టొద్దు…కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని అడ్డుకుందామని కేసీఆర్ ప్రతిపాదించారు.. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేందుకే అభ్యర్థులను నిలబెట్టకుండా కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు..
భూపాలపల్లి రాజలింగమూర్తి హత్యపై విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.. ఒక వ్యక్తిని ప్రాణం తీయడమంటే అంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు… హతుడి భార్య చేస్తున్న ఆరోపణలపై లోతైన విచారణ జరపాలి.. ఎంక్వైరీ కాకముందే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సరికాదు… బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి…. అందులో 10 శాతం ముస్లింలకు కేటాయిస్తే ఏం న్యాయం చేసినట్లు.. దీనిపై సీఎం క్లారిటీ ఇవ్వాలి… కుల గుణన తప్పుల తడక… జనాభా లెక్కలే తప్పు. 3.95 కోట్ల ఆధార్ కార్డులుంటే… జనాభా 3.7 కోట్లు ఎట్లా ఉంటారు? 6 గ్యారంటీలే ప్రధానాస్త్రాలుగా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు.. మతపరమైన రిజర్వేషన్లకు మేం పూర్తిగా వ్యతిరేకం కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంత్రుప్తితో ఉన్నారు. వాళ్లు రహస్య సమావేశాలు నిర్వహించుకుంటున్నారు’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Single Boy Story: “బాబు పెళ్లెప్పుడూ..” 30 ఏళ్లు దాటినా పెళ్లి అవ్వక యువకుల బాధలు వర్ణనాతీతం..
తాజావార్తలు
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!