Prabhas : ప్రశాంత్ వర్మతో సినిమా క్యాన్సిల్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమాతో ప్రశాంత్ వర్మతో సినిమా చేసేందుకు హీరోలు క్యూ కట్టారు. అయితే ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘బ్రహ్మరాక్షస’ అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తునట్టు వార్తలు వచ్చాయి. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపించాయి తప్ప ఇటీవల కాలంలో ఎటువంటి అప్డేట్స్ లేవు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా రద్దు అయినట్లు టాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఇది కాస్త బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
Also Read : YASH : ‘టాక్సిక్’ టీజర్ డేట్ ఫిక్స్..
Also Read
- Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
‘హనుమాన్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ ప్రకటించిన చిత్రాల్లో ఆగిపోయిన మూడో సినిమా ఇది. మొదట బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్‌తో ‘రాక్షస’ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటికీ, క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల అది ఆగిపోయింది. ఆ తర్వాత నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమా విషయంలోనూ మార్పులు జరిగాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమా కూడా ప్రస్తుతానికి అటకెక్కినట్లే అని తెలుస్తోంది. షూటింగ్ కి ముందే జరిగిన టెస్ట్ షూట్ తర్వాత ప్రభాస్ కొన్ని మార్పులు కోరడం దానికి తోడు కాల్ షీట్ల ఇబ్బందుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వరుసగా స్టార్ హీరోలతో అనుకున్న ప్రాజెక్టులు ఆగిపోతుండటం ప్రశాంత్ వర్మకు షాక్ ఇచ్చే విషయమే. అయితే, ఆయనకు ఊరటనిచ్చే ఏకైక అంశం ‘జై హనుమాన్’. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. హంపిలో ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ లాంచ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రశాంత్ తన పూర్తి దృష్టిని ఈ సినిమాపైనే పెట్టనున్నారు. అటు ప్రభాస్ కూడా తన ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?