Cockroach in Mutton Soup : మటన్ సూప్ ఆర్డర్ చేస్తే.. బొద్దింక సూప్ వచ్చిందేంటీ..?
- మటన్ సూప్‌లో దర్శనమిచ్చిన బొద్దింక
- సైనిక్‌పురిలోని అరేబియన్ మంది రెస్టారెంట్‌లో ఘటన
- సోషల్ మీడియాలో ఫుడ్ సెఫ్టీ అధికారులకు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cockroach in Mutton Soup : రోజు రోజుకు హైదరాబాద్‌లో ఆహార పదార్థాల నాణ్యత తగ్గుతోంది. ఇప్పటికే గ్రేటర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లను సీజ్ చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని రెస్టారెంట్ల యాజమాన్యాల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా అహార పదార్థాల నాణ్యత లోపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో ఉన్న అరేబియన్ మంది రెస్టారెంట్‌కు ఓ కస్టమర్ వెళ్లాడు. ఆకలి మీదున్న ఆ కస్టమర్ మటన్ సూప్‌ను ఆర్డర్ చేసి వేయిట్ చేస్తున్నాడు. ఇంతలో తను ఆర్డర్ ఇచ్చిన సూప్ వచ్చింది. ఆవురావురుమని తిన్నేద్దామనుకున్న తనకు అంతలోనే షాక్ తగిలింది. మటన్ సూప్‌లో చెంచా పెట్టిచూస్తే మటన్‌కు బదులు బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో అవాక్కైన కస్టమర్ రెస్టారెంట్ యాజమాన్యం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు.
వాళ్లు దాన్ని చూసి మామూలుగానే రెస్పాన్స్ ఇచ్చారు. దీంతో మరింత ఖంగుతిన్నాడు కస్టమర్ రోహిత్. అయితే.. ఈ ఘటనకు సంబంధించి వీడియోను సామాజిక కార్యకర్త రాబిన్ జక్కీయస్ సోషల్ మీడియా వేదికగా స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అహార భద్రతకు సంబంధించి ఇటువంటి ఉదంతాలు పెరిగిపోతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెస్టారెంట్‌లు పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులను, సంబంధిత శాఖలను కోరారు.
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
అయితే.. అహార భద్రతకు సంబంధించిన ఫిర్యాదులను GHMC కి తెలియజేయాలనుకునే వారు foodsafetywing.ghmc@gmail.com అనే మెయిల్ ఐడీకి పంపించవచ్చు. అలాగే, 040-21111111 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా X (ట్విట్టర్) ద్వారా GHMC అధికారులకు తమ సమస్యలను తెలియజేయవచ్చు. ఇలాంటి ఘటనలు మళ్లీ చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని నగరవాసులు అధికారుల్ని డిమాండ్ చేస్తున్నారు. రెస్టారెంట్‌లు కఠినమైన పరిశుభ్రతా నిబంధనలు పాటించాలని, నాణ్యమైన ఆహారం అందించాల్సిన బాధ్యత తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Serious hygiene issue at The Arabian Mandi @ Sainikpuri.
A resident of Neredmet Mr. Rohit was shocked to see a Cockroach floating in the mutton in a soup before serving Mandi.
When customer questioned about this the owner of the restaurant was arrogant and rude.. refused to… pic.twitter.com/MdIlqxJpEh
— Robin Zaccheus (@RobinZaccheus) February 19, 2025
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!