Konda Surekha : రంగారెడ్డి జిల్లా కన్ష శాంతి వనంలో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు ఏర్పాటు చేసిన నేషనల్ బయోడైవర్సటీ కాన్ఫరెన్స్ -2025లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేషనల్ బయోడైవర్సటీ కాన్ఫరెన్స్ – 2025… ఫిబ్రవరి 20, 21, 22 తేదీలలో రంగారెడ్డిలో మూడు రోజుల పాటు జరగనుందన్నారు. దెబ్బతింటోన్న జీవవైవిధ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మంత్రి కొండా సురేఖ. మన పర్యావరణం, నీరు, భూ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. జీవవైవిధ్య పరిరక్షణ దిశగా సంరక్షణ, పరిశోధన, అధ్యయన రంగాలకు ఉపయుక్తంగా ఈ జీవవైవిధ్య సదస్సు ఉపయోగపడుందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థులు, యువ సైంటిస్టులకు జీవ వైవిధ్యం కోసం పని చేయాలని మంత్రి సురేఖ కోరారు.
Yuzvendra Chahal: క్లిష్ట పరిస్థితుల నుండి రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతలు.. పోస్ట్ వైరల్
తెలంగాణ ఎన్నో విధాలైన సహజమై ప్రాంతాలకు నెలవు, అడవులు, పచ్చిక బయళ్ళు, తడి నేలలు, వృక్షాలు, జంతువులు మన ప్రాంతంలో ఉన్నాయన్నారు. జీవవైవిధ్యం పర్యావరణ సమతుల్యతను సంరక్షించడం మన బాధ్యత… అందుకోసం సమిష్టి కృషి జరగాలన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రపంచవ్యాప్తంగా మానవ తప్పిదం వల్ల మొక్కలు, జంతువులు అంతరించిపోయే దశలో ఉన్నాయని… అయితే, వాటి సంరక్షణ కోసం మానవులుగా మనమే కృషి చేయాలన్నారు. ఒక జాతి అంతరిస్తే దానిలోని జన్యుసంపద అంతరించినట్లే… జీవ వైవిధ్యపు నిజమైన విలువంతా జన్యువుల్లో నిక్షిప్తమై ఉంటుందని మంత్రి సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు, చాలా సంస్థలు జీవ వైవిధ్య సంరక్షణలోనూ దాన్ని ప్రతిభావవంతంగా వినియోగించడంలోనూ నిమగ్నమై ఉన్నాయని స్పష్ఠీకరణ చేశారు కొండా సురేఖ.
OTT: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కేంద్ర ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్..