Hyderabad Rain : హైదరాబాద్‌లో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు చోటుచేసుకుంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్ర ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో, ఒక్కసారిగా వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. ఈ మార్పుతో దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, నాగోల్ వంటి ప్రాంతాల్లో వర్షపు జల్లు కురిసింది. అంతేకాకుండా, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని యాచారం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ తాజా ప్రకటన ప్రకారం, ఈ వర్షపాతం ఇంకా కొనసాగే అవకాశముంది.
Champions Trophy 2025: ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న టీం ఇండియా.. దుబాయ్ రోడ్లై పై భారీ ట్రాఫిక్ జామ్
అయితే, ఇది కేవలం హైదరాబాద్‌కు పరిమితమైన పరిస్థితి కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్ష సూచన ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈశాన్య దిశగా కదులుతూ, దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలను కలిగించనుందని తెలిపింది. అదేవిధంగా, దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల తుఫాను గాలులు వీస్తాయని IMD హెచ్చరించింది. హైదరాబాద్‌లో వర్షపాతం వల్ల జనజీవనం కొంత ప్రభావితమవుతున్నప్పటికీ, ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందిన ప్రజలు స్వల్ప ఉపశమనం అనుభవిస్తున్నారు.