Aadi Srinivas : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ బరితెగించి ముందుకు పోతుందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ భవనంలో ప్రెస్ మీట్లో అధికారుల పట్ల వ్యాఖ్యలు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశామని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్ మీద అనేక ఆరోపణ చేస్తున్నారని ఆయన విమర్శించారు. జిల్లా కేంద్రంలోని 1000 ఎకరాల భూముల ఆక్రమణకు గురైంది, వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నందుకు వ్యక్తిగత జీవితం గురించి చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో మీరు వ్యక్తిగతంగా సినిమా వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడలేదా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.
NDA CMs Key Meeting: ఢిల్లీలో ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశం.. హాజరైన ప్రధాని మోడీ
కలెక్టర్ పై ఎలాంటి కేసు లేదని నేను ఇవాళ మీడియాలో చూసానని, కలెక్టర్ పై కేసులు లేనప్పుడు వ్యక్తి గతంగా అవమాన పరిచినదుకు క్షమాపణ చెప్పాలన్నారు ఆది శ్రీనివాస్. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా టీ పాయింట్ ఫ్లెక్స్ లో కేటీఆర్ ఉంటే తొలగించినందుకు కలెక్టర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని, పదేళ్ల అవినీతి అక్రమ పాలనలో అనేకమంది మా కార్యకర్తలపై కేసులు నమోదు చేసినా భయపడలేదన్నారు ఆది శ్రీనివాస్. ఐపీఎస్, ఐపీఎస్ ఆధికారులకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని, డబుల్ బెడ్రూం లో జరిగిన అవినీతిని బయట తీస్తున్నందుకు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
IND vs BAN: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి భారత్!