Uttam Kumar Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు పఖర్చు పెట్టిన ప్రాజెక్టు వాళ్ల హయాంలోనే కూలిపోయిందన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ..ప్రాజెక్టు వల్ల నీళ్లు రాలేదు కానీ.. వాళ్ల జేబులు నిండాయన్నారు. కాళేశ్వరం కూలిపోయింది. పాలమూరు కింద ఒక్క ఎకరం ఆయకట్టు రాలేదని, సాగునీటి ప్రాజెక్టు ల విషయంలో పూర్తి వైఫల్యం చెందారని ఆయన మండిపడ్డారు. కృష్ణా వాటర్ లో తెలంగాణ కు అన్యాయం జరగొద్దని.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ కు వివరించా అని, పదేండ్ల పాటు అధికారం లో ఉండి.. టెలిమెట్రిక్ ఏర్పాటు చేయలేక పోయారన్నారు. ఏపీ జల దోపిడీ కి సహకరించారని, పదేండ్ల పాటు తెలంగాణ కు కృష్ణా జలాల్లో అన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. పాలమూరు రంగా రెడ్డి పూర్తి చేయలేదు. పదేండ్ల కాలంలో నీటి కేటాయింపులు సాధించలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిపేర్ల ను కూడా మేమే ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Turkey : ఈ దేశంలో భూకంపానికి ఇల్లు కూలితే.. కాంట్రాక్టర్, ఇంజనీర్లకు 18ఏళ్లు జైలు
అంతేకాకుండా..’ కాళేశ్వరం కూలితే.. స్వయంగా ndsa రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. బేసిక్ విచారణ లోనే.. ప్రాజెక్టు డిజైన్ తప్పు ఉందని ndsa స్పష్టం చేసింది. నీళ్లు నింపవద్దని స్వయంగా ndsa లిఖిత పూర్వకంగా లేఖ రాసింది. ప్రాజెక్టుల్లో కమీషన్ కోసం 12 శాతం వడ్డీకి రుణాలు తెచ్చారు. ప్రాజెక్టుల రుణాలను నెగోషియేట్ చేసి 7 శాతానికి తగ్గించాం. జగన్ తో విందు వినోదాలు చేసుకొని.. తెలంగాణ కు తీవ్ర అన్యాయం చేశారు. Slbc టన్నెల్ పనులను పూర్తి స్థాయి లో కంప్లిట్ చేస్తాం. కృష్ణా లో గత పాలకుల అసమర్ధత కారణంగా తెలంగాణకు కేటాయింపులు 299 టీఎంసీ లు ఉంటే కేవలం 180 టీఎంసీ లు మాత్రమే వాడగలిగారు. ఏపీ పునర్ విభజన చట్టంలో సాగునీటి కేటాయింపు ల్లో తెలంగాణ కు జరిగిన అన్యాయన్ని సరి చేయలేదు. కేసీఆర్, హరీష్ రావు పలు మార్లు జరిగిన సమావేశాల్లో తెలంగాణ కు అన్యాయం జరిగేలా చేశారు. నీటి కేటాయింపులపై మేము వచ్చాకే సరి చేస్తున్నాం.’ అని మంత్రి ఉత్తమ్ అన్నారు.
Rohit Sharma: సచిన్‌ను అధిగమించి రికార్డు బద్దలు కొట్టిన హిట్ మ్యాన్..