Sabitha Indra Reddy : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి యూజీసీ రూపొందించిన ముసాయిదా రాష్ట్రాల హక్కులను హరించేలా ఉందని విమర్శించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై చర్చించేందుకు తెలంగాణ భవన్లో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ ఆదేశాలతో పార్టీ వైఖరిని నిర్ణయించేందుకు అనేక నాయకులు పాల్గొన్నారు. సబితా మీడియాతో మాట్లాడుతూ, యూజీసీ ప్రతిపాదించిన నిబంధనలపై అభిప్రాయాలు తెలియజేయాల్సిన గడువు ఈ నెల 30వరకు ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం […]
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై జాప్యం ఎందుకని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బహిరంగంగా ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ ప్రకారం, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీసీల రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఇప్పుడు ఏడాది గడిచినా ఏ మాత్రం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కవిత, బీసీ గణన అశాస్త్రీయంగా నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ […]
కేజ్రీవాల్, ఆప్ మంత్రులు యమునాలో స్నానం చేయగలరా? యూపీ సీఎం సవాల్ వింటర్ సీజన్లో దేశ రాజధాని ఢిల్లీలో వాడివేడి విమర్శలతో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధానంగా ఆప్-బీజేపీ నాయకుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. కేజ్రీవాల్, ఆప్ మంత్రులకు సవాల్ విసిరారు. తాను, యూపీ కేబినెట్ మంత్రులంతా ప్రయాగ్‌రాజ్‌లోని సంగమంలో స్నానం చేశామని.. తమకు లాగా కేజ్రీవాల్, […]
Bhatti Vikramarka : రాష్ట్ర జేడీపీకి సంభందించి జరిగే ఉత్పత్తిలో మీ బంధం అనుబంధం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వంలో ..రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని, సమ్మర్ లో పూర్తి సన్నద్ధంగా ఉన్నాం అని npdcl డిస్కం అధికారులు పేర్కొన్నారన్నారు. రైతులు, పారిశ్రామికవేత్తలు విద్యుత్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. రాష్ట్ర సామాజిక, ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు అని, ఉద్యోగ వ్యవస్థకు […]
Komatireddy Venkat Reddy : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్లలో 25 కోట్ల రూపాయలతో ఆదిభట్ల నుంచి మంగళ్ పల్లి రోడ్డుకు శంకుస్థాపన చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అనంతరం బహిరంగసభలో పాల్కొని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన నుంచి వచ్చాక చర్చించి రతన్ టాటా విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. దేశంలో తన సంపదలో సగానికిపైగా ప్రజల కోసం పంచిన […]
Ponnam Prabhakar : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పునరుద్ధరింపబడిన బస్టాండ్ ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సంవత్సరంలో 4 కోట్ల 500 రూపాయల విలువ గల 134 కోట్ల మంది మహిళలను క్షేమముగా గమ్య స్థానాలకు చేర్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో హుస్నాబాద్ డిపో పరిధిలోని 169 గ్రామాలకు బస్ సౌకర్యం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. హుస్నాబాద్ డిపో లాభాల్లో నడవడం శుభసూచకం, […]
ChatGPT : అత్యంత ప్రజాదరణ పొందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బాట్లలో ఒకటైన ChatGPT సేవల్లో అంతరాయం నెలకొంది. చాట్ జీపీటీ సేవల్లో అంతరాయం చోటు చేసుకోవడం యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా చాట్‌జీపీటీ మొరాయించింది. అయితే.. ఈ మధ్య చాట్‌జీపీటీ వినియోగం పెరగడంతో దీనిపై ఆధారపడిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఎక్కువగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అదే విధంగా ఎక్సెల్ షీట్స్ దీంతో పాటు కోడింగ్ వంటి విషయాల్లో కూడా చాట్ జీపీటీ […]
కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం.. లబ్దిదారుల ఎంపిక కోసం చేపట్టిన గ్రామ సభల్లో లీడర్ల చెంపలు పగులుతున్నాయి. గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక సందర్బంగా నాయకుల మధ్య విద్వేశాలు రగులుతున్నాయి. అయితే, తాజా ఘర్షణలకు ఎక్కువ భాగం నిన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉండి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి మధ్యనే వివాదాలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి ఈ సభల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పట్టణాల్లో సాఫీగా జరుగుతున్నప్పటికీ గ్రామాల్లోమాత్రం నేతల మధ్య వాగ్వావాదాలు, […]
Data Center : పెట్టుబడులు, మౌలిక సదుపాయాలలో ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్‌స్టోన్ హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. 150 మెగావాట్ల డేటా సెంటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో బ్లాక్‌స్టోన్ లూమినా (బ్లాక్‌స్టోన్ యొక్క డేటా సెంటర్ విభాగం)తో పాటు జేసీకే ఇన్ఫ్రా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతిపాదిత డేటా సెంటర్ ₹4,500 కోట్ల వరకు పెట్టుబడి పెడుతుంది. ఇంధన సామర్థ్యం, అధునాతన శీతలీకరణ వ్యవస్థలు, సైబర్ […]
Tummala Nageswara Rao : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం జనవరి 26 నుంచి రాష్ట్ర రైతులకు “రైతు భరోసా” అందించనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ , సూర్యాపేట జిల్లా కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసకర పాలన వల్ల […]