దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే ప్రపంచ స్థాయి నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. అద్భుతమైన మౌలిక వసతులతో ఏర్పాటయ్యే ఈ నగరాన్ని 13,500 ఎకరాలలలో జీరో కార్బన్ సిటీగా రూపొందించనున్నట్టు తెలిపారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ, యాజ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ 3 ట్రిలియన్ డాలర్స్ తెలంగాణా’ అనే అంశంపై ప్రభుత్వ ప్రణాళికలను మంగవారం నాడు ఆయన గ్లోబల్ సమ్మిట్ లో వివరించారు. భవిష్యత్ […]
Akshat Greentech : భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ప్రపంచ స్థాయిలో ఎదిగేలా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇండియా ఎలక్ట్రానిక్స్ మిషన్‌కు తెలంగాణ రాష్ట్రం కీలక మద్దతుగా నిలవనుంది. ఈ దిశగా రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీ విస్తరణకు మరొక కీలక ముందడుగు పడింది. లండన్, తెలంగాణకు చెందిన కైలాస్ ఫ్యామిలీ నేతృత్వంలో ఉన్న అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ ఒప్పందం ద్వారా అక్షత్ […]
Drunken Drive : నగరంలో వీకెండ్ ట్రాఫిక్ తనిఖీల్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వెలుగుచూశాయి. శనివారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న 474 మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరిలో అధిక సంఖ్యలో ద్విచక్ర వాహనదారులే ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత మూడు చక్రాల వాహన డ్రైవర్లు, కార్లు తదితర నాలుగు చక్రాల వాహనదారులు ఉన్నారు. తొమ్మిది మందిలో అత్యంత అధిక స్థాయిలో ఆల్కహాల్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. […]
Telangana Rising Global Summit : తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8వ తేదీన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేయనున్నారు. ఈ కీలకమైన సదస్సును రాజకీయాలకు అతీతంగా జరపాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా, సమ్మిట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, […]
ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్న స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్.. మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దు అయినట్లు ప్రకటించింది. గత కొన్ని రోజులుగా నడుస్తున్న సస్పెన్స్‌కు మంధాన ఫుల్ స్టాప్ పెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి రద్దు అయిన విషయాన్ని ప్రకటించింది. పెళ్లి రద్దు గురించి ప్రకటించిన కొంతసేపటికే.. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. నవంబర్ 23న ఈ జంటకు వివాహం జరగాల్సి ఉంది. అయితే, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానాకి […]
Telangana : హైదరాబాద్‌లో మౌలిక వసతులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రావిర్యాల వద్ద ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదిత రేడియల్ రింగ్ రోడ్డుతో (RRR) కలుపుతూ నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశ పారిశ్రామిక రంగానికి ఆయన అందించిన విశేష సేవలకు గౌరవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా, ప్లానెట్ ఎర్త్ ఫర్ ఫస్ట్ […]
తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దమైంది. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవాప్తంగా పేరెన్నికగల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. ఒక్క […]
Telangana Rising Global Summit : హైదరాబాద్‌లో జరగనున్న రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్‌కు పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. సమ్మిట్‌ను సురక్షితంగా నిర్వహించేందుకు దాదాపు 6 వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 14 నుంచి సమ్మిట్ ప్రధాన వేదిక వరకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నామని వెల్లడించారు. సమ్మిట్ వేదికను ఇప్పటికే […]
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సోమ, మంగళవారాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ఈ రెండు రోజుల సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు హాజరవనున్న నేపథ్యంలో, సమ్మిట్ ప్రాంగణంతో పాటు నగరాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తన సందేశాన్ని అందించారు. ‘జాతి కోసం… […]
వరంగల్ జిల్లా సంగెం మండలం వంజర పల్లి గ్రామంలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.. గ్రామంలో 375 మంది జనాభా వున్న గ్రామంలో ఎస్టీ జనాభా ఏ ఒక్కరూ లేనప్పటికీ సర్పంచ్, మూడు వార్డు స్థానాలకు ఎస్టీ రిజర్వేషన్‌ను ఎన్నికల అధికారులు కేటాయించారు. దీంతో గ్రామంలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయడానికి ఏ ఒక్కరు లేకపోవడంతో సర్పంచ్ తో పాటు మూడు వార్డు సభ్యులకు నామినేషన్ దాఖలు కాలేదు. ఎన్నికలు […]