ఆ నియోజకవర్గ హస్తం పార్టీలో నేతల చేతులు కలవడం లేదు. ఇక మనసులు, మాటల గురించి అయితే చెప్పే పనేలేదు. సర్ది చెప్పాల్సిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఓ వర్గాన్ని సపోర్ట్ చేస్తూ… అగ్గికి ఆజ్యం పోస్తున్నారట. రెండు వర్గాలు వేర్వేరుగా మీటింగ్స్ పెట్టుకుంటే రెండు చోట్లకు వెళ్తున్న ఆ మంత్రివర్యులు ఎవరు? ఏ జిల్లాలో, ఎందుకా పరిస్థితి వచ్చింది? సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకప్పుడు టిడిపి హవా కొనసాగగా… ఆ తర్వాత […]
హైదరాబాద్ నగరంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ప్రమాదకర అలవాటు వల్ల రహదారులపై రద్దీతో పాటు ప్రాణాపాయ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఈ సమస్యను అరికట్టేందుకు ఇటీవల ట్రాఫిక్ శాఖ భారీ స్థాయిలో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తోంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వివరాల ప్రకారం అక్టోబర్ మొదటి వారంలోనే వారంరోజుల ప్రత్యేక డ్రైవ్‌లో 10,652 మంది మోటారిస్టులపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు. నగరంలోని మల్టీలేన్ […]
ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్ , ఆర్ అండ్ బి శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అక్టోబర్ మాసానికి సంబంధించి సుమారు 1,031 కోట్ల రూపాయలను ఒకేసారి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. శుక్రవారం ఉదయం ప్రజా భవన్ లో ఆర్థిక శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. స్టైలిష్ లుక్, ADAS లెవెల్ 2 ఫీచర్, అబ్బురపరిచే ఫీచర్లతో లాంచ్‌కు సిద్దమైన […]
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈసారి ఇంటర్ పరీక్షలు మామూలుగా మార్చిలో కాకుండా ముందుగానే ఫిబ్రవరిలోనే ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం విద్యార్థులు JEE మెయిన్, EAPCET (EAMCET), NEET వంటి పోటీ పరీక్షలకు సులభంగా సిద్ధం కావడానికి ఎక్కువ సమయం దొరకడం. ఈ […]
Jagadish Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడెక్కుతున్న వేళ, ప్రచార రంగంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు, పోలీసులు, గుండాయిజాన్నే నమ్ముకున్నారని, కానీ ప్రజలు ఈ రౌడీయిజాలను, బెదిరింపులను ఎప్పుడూ లెక్కపెట్టరు అని వ్యాఖ్యానించారు. తండ్రి లాగానే కుమారుడూ భయపెడతానంటూ మాట్లాడుతున్నారని, కానీ […]
Jogi Ramesh : వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బద్నాం చేసి వైసీపీని డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నారా వారి సారా ఎపిసోడ్‌ను బయటపెట్టిన తర్వాతే తమపై కుట్రలు మొదలయ్యాయని ఆయన అన్నారు. జోగి రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నారా వారి సారా ఎపిసోడ్ గురించి అందరికీ వివరించా. ఇబ్రహీంపట్నం తయారీ కేంద్రం వద్దకు వెళ్లి నిజాలు బయటపెట్టా. అక్కడ తయారైన సారా […]
ఆభరణాల ప్రపంచంలో కొత్త మెరుపు చేరబోతోంది. హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రజలకు నూతన ఆభరణాల అనుభవాన్ని అందించేందుకు పూర్వి జువెలర్స్ (ముకుంద జువెలర్స్) కొత్త షోరూమ్‌ను ప్రారంభించనుంది. నవంబర్ 1, 2025న మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ గ్రాండ్ లాంచ్ వేడుకకు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మరియు స్థానికులు హాజరుకానున్నారు. కేపీహెచ్‌బీ ఫేజ్–1, రోడ్ నం. 4లో ఏర్పాటు చేసిన ఈ నూతన షోరూమ్ ఆధునిక డిజైన్లతో పాటు సాంప్రదాయ శైలిని కలగలిపిన ఆభరణాలను అందించనుంది. పూర్వి జువెలర్స్ […]
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో గెలిచి, ఫైనల్ బరిలోకి దూసుకెళ్లింది.
ఏపీ స్థానిక ఎన్నికల్లో పోటీ విషయమై వైసీపీలో అంతర్మథనం జరుగుతోందా? బరిలో ఉండే విషయమై పార్టీలో ఏకాభిప్రాయం లేదా? అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు రాకున్నా… కింది స్థాయిలో మాత్రం కంగారు పడుతున్నారన్నది నిజమేనా? ఎందుకా కంగారు? లోకల్ బాడీస్ ఎలక్షన్స్‌లో పోటీ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? షెడ్యూల్ ప్రకారం వచ్చే మార్చిలో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎలక్షన్స్‌లో ప్రతిపక్షం వైసీపీ పోటీ చేస్తుందా లేదా అన్న […]